రాజమౌళి సినిమా కోసం బన్నీ ప్రయత్నాలు..!

రాజమౌళి సినిమా కోసం బన్నీ ప్రయత్నాలు..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా వచ్చిన నా పేరు సూర్య ఫ్లాప్ అవ్వడం తో టాప్ హీరోలా రేసులో వెనుక పడిపోయాడు అని చెప్పాలి. అయితే బన్నీ తరువాత ఏ సినిమా చేయాలో తెలియని డైలమా లో ఉన్నట్టు తెలుస్తుంది. తరువాత సినిమా ను పక్కాగా సెట్ చేసుకోవాలని అనుకున్టట్లు తెలుస్తుంది. అయితే బన్నీ కి రాజమౌళి దర్శకత్వం లో నటించడానికి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నట్టు కొన్ని వార్తలు వచ్చినాయి. అయితే ‘విజేత’ సినిమా ను ప్రమోట్ చేసే విషయం లో కొన్ని వ్యాఖ్యలు రాజమౌళి సినిమా మీద ఆసక్తి ని తెలియజేస్తాయి.

అయితే సాయి కొర్రపాటి వారాహి బ్యానర్ లో సినిమా చేయాలని వుంది అని నిన్న ప్రకటించడం వెనుక కాస్త గట్టి పరమార్థమే వుందనిపిస్తోంది.. రాజమౌళి డైరక్షన్ లో సినిమా చేయాలన్నది బన్నీ చిరకాల కోరిక. అది నెరవేరడం లేదు. బాహుబలి సిరీస్ తరువాత అవకాశం కోసం కొంచెం ప్రయత్నించినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. రాజమౌళితో ఓ సందర్భంలో స్టేజ్ షేర్ చేసుకున్నపుడు, ఆయన పట్ల తన అభిమానం, గౌరవం అన్నీ బన్నీ ప్రసంగంలో తొంగి చూసాయి కూడా.

ఇక సాయి కొర్రపాటి అంటే రాజమౌళికి అత్యంత ఆప్తుడు అన్న సంగతి తెలిసిందే. అందువల్ల రాజమౌళి ఆప్తుడు అయిన సాయి కొర్రపాటికి సరైన సమయంలో సాయం చేస్తే, అది ఊరికే పోదు. పైగా అదే వేదిక మీద తను సినిమా చేసే కోరిక కూడా ప్రకటించేసారు. ఆ విధంగా రాజమౌళికి కూడా దగ్గర కావచ్చు. మొత్తం మీద మంచి స్ట్రాటజీలతోనే ముందుకు వెళ్తున్నాడు బన్నీ. ఈ విధముగా బ్యాంక్ వ్యూహాత్మకంగా మాట్లాడిన మాటలు చాలా అర్ధాలు వచ్చే విదంగా ఉన్నాయని సినీ సర్కిల్ లో వినిపిస్తున్న మాటలు.

Related Images: