ఓవర్సీస్ లో నందమూరి హీరోలకు ఫుల్ డిమాండ్..!

ఓవర్సీస్ లో నందమూరి హీరోలకు ఫుల్ డిమాండ్..!

బాహుబలి ముందు వరకు తెలుగు చిత్రాలు ఓవర్సీస్ లో పెద్దగా మార్కెట్ ఉండేది కాదు..కానీ ఎప్పుడైతే బాహుబలి వచ్చిందో అప్పటినుండి తెలుగు సినిమాలంటే ఓ ప్రత్యేకంగా చూస్తున్నారు. చిన్న , పెద్ద అనే తేడాలు లేకుండా భారీ మొత్తంలో తెలుగు సినిమాలను కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యం గా మహేష్ బాబు సినిమాలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఆ తర్వాత రామ్ చరణ్ , అల్లు అర్జున్ , ఎన్టీఆర్ లకు డిమాండ్ ఉంది.

తాజాగా ఇప్పుడు నందమూరి హీరోలా నుండి రాబోయే చిత్రాలకు గతం లో ఎన్నడూ లేని విధంగా డిమాండ్ ఏర్పడిందట. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న అరవింద సమేత చిత్రాన్ని రూ. 11 కోట్లకు ఓ ప్రముఖ సంస్థ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. అలాగే బాలకృష్ణ తన తండ్రి రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ సినిమాను నిర్మిస్తూ , హీరోగా నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

ఈ సినిమాను ఓవర్సీస్ హక్కులను దక్కించుకోవడానికి పోటీ పడుతున్నారట. రూ.12 కోట్ల రూపాయలకు ఎన్టీఆర్ బయోపిక్ హక్కులను దక్కించుకోవాలని ఓ సంస్థ సిద్ధం అయినట్లు సమాచారం. మొత్తం మీద ఈ రెండు చిత్రాల ఫై ఓవర్సీస్ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్న నేపథ్యం లో ఈ చిత్రాలను కొనుగోలు చేసేందుకు పోటీ పడ్డారట. అరవింద సమేత దసరా బరిలో రాబోతుండగా, ఎన్టీఆర్ బయోపిక్ జనవరి 9 న విడుదల కాబోతుంది.

Related Images: