టీం ఇండియా జైత్రయాత్రకి ఇంగ్లాండ్‌ బ్రేక్‌..!

టీం ఇండియా జైత్రయాత్రకి ఇంగ్లాండ్‌ బ్రేక్‌..!

గత రెండేళ్లుగా వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీం ఇండియా కు ఇంగ్లాండ్‌ బ్రేక్ వేసింది. లీడ్స్ వేదికగా మంగళవారం రాత్రి ఇంగ్లాండ్‌ తో జరిగిన సిరీస్ విజేత నిర్ణయాత్మక వన్డేలో భారత్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ పేలవరీతిలో విఫలమైంది. దీంతో 1-2 తేడాతో ఇంగ్లాండ్‌ సిరీస్ సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని ఇంగ్లాండ్ కేవలం 44.3 ఓవర్లలోనే 260/2తో ఛేదించేసింది.

మ్యాచ్ అనంతం కోహ్లీ మాట్లాడుతూ ప్రపంచకప్‌కి ముందు తప్పిదాలను దిద్దుకునేందుకు ఇంగ్లాండ్‌ పర్యటన భారత జట్టుకి ఉపయోగపడుతోందని పేర్కొన్నాడు. 2016, జనవరి తర్వాత భారత్‌ ఓ ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను చేజార్చుకోవడం ఇదే తొలిసారి. ఇంగ్లాండ్ వేదికగానే 2019 ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో.. తాజా సిరీస్‌ ఓటమి భారత్‌కి హెచ్చరిక అని కోహ్లి వివరించాడు.

Related Images: