నాని సెంటిమెంట్ తో బిగ్ బాస్ 2 కు సమస్యలు !

నాని సెంటిమెంట్ తో బిగ్ బాస్ 2 కు సమస్యలు !

‘బిగ్ బాస్ 2’ ప్రారంభం అయిన దగ్గర నుండి ఈషోకు ఏర్పడుతున్న సమస్యలతో పాటు రోజురోజుకు ఈషో పై పెరిగిపోతున్న నెగిటివ్ ట్రెండ్ ను కట్టడి చేయడానికి స్టార్ మా యాజమాన్యం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా ఫలితాలు రాకపోవడం లేదు. దీనితో ఇంకా సుమారు 50 రోజులు పైన నడవవలసిన ఈకార్యక్రమాన్ని ఎలా సక్సస్ ఫుల్ గా పూర్తి చేయాలో తెలియక ‘బిగ్ బాస్ 2’ టీమ్ తికమక పడిపోతోంది.

nani bigboss season2 

ఇప్పటికే రేటింగ్స్ బాగా తగ్గిన ఈషోకు సంబంధించి లేటెస్ట్ గా ఒక నెగిటివ్ సెంటిమెంట్ ప్రచారంలోకి రావడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. ఇప్పటికే ఈకార్యక్రమ హోస్టింగ్ పరంగా నానికన్నా ఎన్నో ఎక్కువ మార్కులు పొంది ముందు వరసలో ఉన్న జూనియర్ గోల్డెన్ హ్యాండ్ టచ్ గురించి ఇప్పుడు ప్రచారం మొదలైంది.

nani host bigboss season2

 

బిగ్ బాస్ సీజన్-1 లో జూనియర్ ప్రమోట్ చేసిన ‘నేనేరాజు నేనేమంత్రి’ ‘ఆనందో బ్రహ్మ’ ‘అర్జున్ రెడ్డి’ ‘జై లవ కుశ’ మూవీలు సూపర్ హిట్ అయితే ఈసారి బిగ్ బాస్ 2 సీజన్ లో నాని ప్రమోట్ చేసిన ‘తేజ్ ఐ లవ్యూ’ ‘జంబలకడి పంబ’ ‘వైఫ్ ఆఫ్ రామ్’ సినిమాల నాని చేసిన ప్రమోషన్ ఏమాత్రం కలిసిరాకపోవడంతో నాని హ్యాండ్ టచ్ లో లక్ తగ్గిందా అన్న సెటైర్లు పడుతున్నాయి. ఈ సెంటిమెంట్ ను బట్టి భవిష్యత్ లో చాల సినిమాలు ‘బిగ్ బాస్ 2’ షోలో ఎంట్రీ ఇవ్వడానికి భయపడిపోతాయి.

ఇక లేటెస్ట్ గా హీరోయిన్ మాధవిలత ‘బిగ్ బాస్ 2’ షో పై కామెంట్స్ చేస్తూ నాని సమర్థత పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నాని హోస్టింగ్ లో ఏదో ఒక లోటు కనిపిస్తోంది అంటూ అతడి హోస్టింగ్ లో ఉత్సాహంకన్నా నీరసం ఎక్కువగా కనిపిస్తోంది అంటూ జోక్ చేసింది. ఏది ఎలా ఉన్నా నానీ సమర్థత పై జరుగుతున్న మాటల దాడిని తిప్పి కొట్టడంలో నాని ఇంకా వెనకబడి ఉన్నాడనే అని పిస్తోంది..

Related Images: