జగన్ కే జనాదరణ, కానీ…!

జగన్ కే జనాదరణ, కానీ…!

పాము చావదు, కర్ర విరగదు, ఇలా ఉంటోంది మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారి రాజకీయం. ఏ రాజకీయ పార్టీలో లేనంటూనే ఆయన ఈ మధ్య కాలంలో చంద్రబాబుని కలిశారు, అంతకు ముందు జనసేనాని పవన్ ని కూడా కలిసారు. వైఎస్ జయంతి వేళ ఆయన్ని కీర్తిస్తూ జగన్ కి సంబంధించిన మీడియాలో మాట్లాడారు. మొత్తానికి ఉండవల్లి ఏపీ రాజకీయాలపై తనదైన విశ్లేషణ చేస్తున్నారనిపిస్తూనే ఎటో మొగ్గుతున్నారనీ అనిపిస్తున్నారు.

జనం మొగ్గు జగన్ వైపే :

ఏపీలో ఉధ్రుతంగా సాగుతున్నా జగన్ పాదయాత్ర ద్వారా జనం పెద్ద ఎత్తున జగన్ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోందని ఉండవల్లి అంటున్నారు. ఎక్కడ చూసిన జనమే జనంగా జగన్ కి నీరాజనం పడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఇదంతా చంద్రబాబు పాలన మీద కోపమేనని కూడా వ్యాఖానించారు.ఈ జనం స్పందన చూస్తుంటే వైసీపీకే పవర్ అనిపిస్తోందని కూడా చెప్పారు.

అది ఇంకా చూడాలట :

మరో వైపు జనసేనాని పవన్ కళ్యాణ్ వైపు ఇంతవరకు ఏపీ ఓటర్ పెద్దగా మొగ్గు చూపింది లేదని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. అయితే పవన్ కూడా ఏపీవ్యాప్తంగా తిరిగిందీ లేదన్నారు. ఆయన మొత్తం రాష్ట్రం చుట్టి వస్తే తప్ప ఆయనకు లభించే జనాదరణను అంచనా వేయలేమని ఉండవల్లి అంటున్నారు. ఇప్పటికైతే జనంలో జగన్ కే బాగా అదరణ ఉందని, బాబుకు కూడా ఎక్కడా జనం రావడం లేదని తేల్చేశారు.

కానీ.. అలా జరగొచ్చట :

సరిగ్గా ఇక్కడే ఉండవల్లి ఓ ట్విస్ట్ ఇచ్చారు. ఎంతగా జగన్ కి జనాదరణ ఉన్నా ఎన్నికల మేనేజ్ మెంట్ లో మాత్రం బాబు దిట్ట అంటూ ఉండవల్లి కితాబు ఇస్తున్నారు. పోల్ మేనేజ్ మెంట్లో బాబుని మించిన వారు ఏపీలో లేరని, చివరి నిముషంలో కూడా విజయం తనకు అనుకూలం చేసుకునే సత్తా బాబుకు ఉందని ఆయన గట్టిగా చెబుతున్నారు. అంటే దీని అర్ధం వచ్చే ఎన్నికలలో బాబుకూ విజయావకాశాలు బాగానే ఉన్నాయని చెప్పకనే చెబుతున్నారు.

దీనికి ఆయన 2014 ఎన్నికలను శాంపిల్ గా తీసుకున్నారు. అప్పట్లో కూడా జగన్ హవా బాగా ఉన్న అఖరాఖరున బాబు మొత్తం సీన్ మార్చేశాడని కూడా గుర్తు చేస్తున్నారు. మొత్తానికి ఎవరిని నొప్పించకుందా ఉండవల్లి గారి సర్వే సాగిందిలా.