‘భరత్‌ అనే నేను’ వందరోజుల పండగ

‘భరత్‌ అనే నేను’ వందరోజుల పండగ

మహేష్ బాబు అదిరిపోయే హిట్ కొట్టాడు. భరత్ అనే నేను తో సాలిడ్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. కొరటాల శివ మహేష్ కలయికలో వచ్చిన భరత్‌ అనే నేను’ సినిమా అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్ లోనే బెస్ట్ కలెక్షన్స్ సాధించింది. నాన్-‘బాహుబలి’ రికార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమా ఇప్పుడు వందరోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా యూనిట్ ఒక కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది.

ప్రస్తుతం మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. సినిమా సీమ బాక్ డ్రాప్ లో ఉండబోతుందని టాక్. మహేష్‌బాబు కెరీర్‌ని మలుపు తిప్పిన ‘ఒక్కడు’ సీమ నేపథ్యానికి సంబంధించిన కథే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. పూజా హెగ్డే కథానాయిక. అల్లరి నరేష్‌ ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ మ్యూజిక్.

ఈ సినిమాతర్వాత సుకుమార్‌ దర్శకత్వంలో మహేశ్‌ నటించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మించనుంది. గతంలో మహేశ్‌-సుకుమార్‌ కాంబినేషన్‌లో ‘1: నేనొక్కడినే’ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. విభిన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు మరో సినిమా రాబోతుంది ఈ కాంబినేషన్ లో.

Related Images: