ఎన్టీఆర్ బయోపిక్ కి విద్యాబాలన్ షాకింగ్ రెమ్యూనరేషన్!

ఎన్టీఆర్ బయోపిక్ కి విద్యాబాలన్ షాకింగ్ రెమ్యూనరేషన్!

టాలీవుడ్ లో ఇప్పుడు క్రిష్-బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘ఎన్టీఆర్’ బయోపిక్. మొదట్లో ఈ సినిమాపై ఎన్నో వివాదాలు చుట్టుముట్టినా..ఎప్పుడైతే క్రిష్ చేతికి ప్రాజెక్ట్ వచ్చిందో..షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో బాలకృష్ణ ఎన్నో రకాల గెటప్స్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. సినిమాలు, రాజకీయాలు ఎన్ని ఉన్నా ఎన్టీఆర్ కుటుంబం అంటే ఎంతో మక్కువ…కుటుంబానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారని తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ షరవేగంగా జరుగుతుంది.

అయితే గత కొంత కాలంగా ఈ సినిమాలో కొంత మంది నటీనటుల గురించి వస్తున్న వార్తలు డైరెక్టర్ క్రిష్ కొట్టి పడేశారు.రీసెంట్ గా కైకాల సత్యనారాయణ కు సంబంధించిన ఫోటో ఒకటి అఫిషియల్ గా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ భార్య బసవతారకంగా బాలీవుడ్ ప్రముఖ నటి విద్యాబాలన్ నటిస్తోంది. బాలకృష్ణ పట్టుబట్టి మరీ విద్యాబాలన్‌ను ఆ పాత్రకు ఒప్పించి హైదరాబాద్ తీసుకొచ్చారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ కొత్త విషయం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. బసవతారకం పాత్ర కోసం విద్యాబాలన్‌కు ఏకంగా కోటిన్నర రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ నుంచి తీసుకొచ్చిన ఆమెకు అంత రెమ్యునరేషనా? అంటూ టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక్క ఆమెకే అంత చెల్లిస్తే మొత్తం బడ్జెట్ ఎంత ఉంటుందన్న ఊహాగానాలు కూడా మొదలయ్యాయి.

Related Images: