ఎనిమిదేళ్ల తర్వాత ఆ జంట కలవబోతున్నారు..!
ప్రపంచ మాజీ సుందరి ఐశ్వర్య రాయ్ ఎనిమిదేళ్ల తర్వాత తెరఫై రొమాన్స్ పంచుకోబోతుంది..ఎవరితోనో తెలుసా తన భర్త అభిషేక్ బచ్చన్ తో..అవును వీరిద్దరూ పెళ్లి చేసుకొని హ్యాపీ గా ఉన్న , అభిమానులు మాత్రం వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేయాలనీ చాల రోజులుగా అనుకుంటున్నారు. వీరి కోరిక తీరడానికి ఎనిమిదేళ్లు పట్టింది. అప్పుడెప్పుడో ‘ఉమ్రావ్ జాన్’, ‘కుచ్ నా కహో’, ‘రావణ్ ‘ వంటి చిత్రాలతో పాటు మరో సినిమాలో జంటగా నటించిన వీరు మళ్లీ ఇంతకాలానికి కలిసి నటించబోతున్నట్లు సమాచారం.
ఈ విషయాన్ని స్వయంగా ఐశ్వర్య రాయ్ నే మీడియాతో పంచుకున్నారు. తన భర్త అభిషేక్ బచ్చన్ తో కలిసి సర్వేశ్ మెవారా దర్శకత్వంలో నటించబోతున్నట్లు ఆమె తెలిపింది. ఈ చిత్ర కథ చాలా బాగుంటుందని, కథలోని పాత్రలకు అభిషేక్, నేను కరెక్ట్ గా సరోపోతామని ఈమె చెప్పుకొచ్చింది. బాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం ఐశ్వర్య రాయ్, అభిషేక్ కాంబినేషన్ లో వస్తోన్న ఈ చిత్రానికి ‘గులాబ్ జామున్’ అనే టైటిల్ ను పెట్టబోతున్నట్లు అంటున్నారు. మరి ఈ టైటిల్ ఫై అధికారిక ప్రకటన అయితే రాలేదు. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు తెలియజేస్తారట.