త్రివిక్రమ్ సినిమాలో జాయిన్ అయిన సునీల్.!

త్రివిక్రమ్ సినిమాలో జాయిన్ అయిన సునీల్.!

కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ మళ్లీ ఇటు వైపు కూడా ఓ కన్నేయాలని డిసైడ్ అయిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో సునీల్ మళ్లీ కామెడీ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ తో తీస్తున్న అరవింద సమేత వీరరాఘవ సినిమాలో ఓకే కీ రోల్ చేస్తున్నాడు సునీల్.

ఇప్పుడు ఈ సెట్స్ లో జాయిన్ అయ్యాడు సునీల్. అరవింద సమేత వీరరాఘవ సినిమా చిత్రీకరణ మండల పరిధిలోని భీమనపల్లి, కనుముకుల గ్రామాల్లో మంగళవారం జరిగింది. భీమనపల్లి గ్రామంలో హీరోయిన్‌ పూజాహెగ్డే, సునీల్‌ గ్రామంలోని ప్రజలను ఇంటర్వ్యూ చేస్తున్న సన్నివేశాలను దర్శకుడు త్రివిక్రమ్‌ చిత్రీకరించారు. ఇంటర్వ్యూ పూర్తి చేసుకొని జీపులో వెళుతుండగా కనుముకుల గ్రామంలోని దేవాలయం ఆవరణలో జీపు చెడిపోవడంతో దేవాలయంలోకి వెళ్లి పూజలు చేసే సన్నివేశాలను చిత్రీకరించారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక, హాసిని క్రియేషన్స్‌ నిర్మిస్తుంది.

Related Images: