బిగ్‌బాస్ షోపై కమెడియన్ పృధ్వీ సంచలన కామెంట్స్..!

బిగ్‌బాస్ షోపై కమెడియన్ పృధ్వీ సంచలన కామెంట్స్..!

తెలుగులో మొట్ట మొదటి రియాల్టీ షోగా వచ్చింది బిగ్‌బాస్. ఈ షో ప్రేక్షకులకు నచ్చుతుందా? ఆదరణ ఉంటుందో.. ఉండదో అనే స్థితిలో ప్రారంభమైంది. కానీ తర్వాత తర్వాత పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ప్రేక్షకులు ఈ షోను ఆదరించడం మొదలు పెట్టారు. మంచి రేటింగ్‌తో నడుస్తుండటంతో నిర్వాహకులకు కూడా కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇటీవలే సీజన్ 2ను కూడా స్టార్ట్ చేశారు. ఈ సారి సెలబ్రిటీలనే కాకుండా కామన్ మ్యాన్‌ను కూడా దీనిలో భాగం చేశారు. సీజన్ 2 కూడా ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. అయితే తాజాగా దీనిపై కమెడియన్ పృధ్వీ సంచలన కామెంట్స్ చేశారు.

”బిగ్‌బాస్ షో ఎవరికి ఉపయోగం? ఒక గదిలో పెట్టి.. ఇది ఎలా ఉందంటే ఒక పెళ్లి జరుగుతా ఉంటుంది. ఇప్పుడంటే హోటల్స్.. క్యారావ్యాన్స్.. గతంలో ఇవేమీ ఉండేవి కాదు. పెళ్లికి వచ్చిన వాళ్లంతా మండపంలో కూర్చునేవాళ్లు.

వారిలో ఒకడికి పెళ్లైనా.. అంతకు ముందు ప్రేమించిన అమ్మాయి కనిపిస్తుంది. అర్థరాత్రి వీళ్లిద్దరూ ఎవరికీ కనిపించకుండా మాట్లాడుకుంటుంటారు. ఇదే బిగ్‌బాస్ షో.

జనాల్ని పిచ్చోళ్లని చేయడం.. వాడొచ్చి దీన్ని గిల్లాడు.. వీడొచ్చి దాన్ని గిల్లిచ్చాడు.. బాస్ మిమ్మల్ని పిలుస్తున్నాడు రండి.

వేరే పనీపాటా ఏమీ లేదా? డబ్బులు తీసుకుని ఇవా చూపించేది? అందరూ ఒకచోట పడుకోవడం. నాకు కష్టం బిగ్‌బాస్.

నాకు నిద్రలో లేచే అలవాటు. నిద్రలో వెళ్లి ఎవరిపక్కనైనా పడుకుంటే రేపు పొద్దున పెద్ద గొడవ. పృధ్వీ తెలిసే ఒకామె పక్కన పడుకున్నాడని. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా నాకు ఆపర్చునిటీ వస్తే లోపల ఉన్న వాళ్లని కడిగి పారేస్తా.

ఒకాయన షోలో ధర్మో రక్షతి రక్షిత: అన్నట్టు ఉంటాడు. ధర్మ పరిరక్షణార్థం నేను పుట్టాను.. ఇన్ని మాటలు మాట్లాడుతుంటాడు. బిగ్‌బాస్ షోలో కరెక్ట్ మజా ఉండాలంటే పోసాని కృష్ణ మురళి, పృధ్వీరాజ్ రావాలి.

ఇలాంటి వాళ్లు వస్తే కడిగిపారేసేవాళ్లం” అని చెప్పుకొచ్చారు పృధ్వి.

Related Images: