చరణ్ డెసిషన్ కు షాక్ అయిన చిరంజీవి !

చరణ్ డెసిషన్ కు షాక్ అయిన చిరంజీవి !

మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ కు సంబంధించి రామ్ చరణ్ తీసుకున్న షార్ప్ డెసిషన్ కు చిరంజీవి షాక్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈమూవీకి సంబంధించిన హైదరాబాద్‌ లో వేసిన సెట్ ప్రభుత్వ అధికారులు కూల్చి వేయడం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. అనుమతి లేకుండా ప్రభుత్వ భూమిలో అక్రమంగా సెట్ వేయడంతో రంగంలోకి దిగిన గవర్నమెంట్ అఫీషియల్స్ శేరిలింగంపల్లిలో వేసిన ‘సైరా’ సెట్‌ ను నేలమట్టం చేశారు.

ఈవిషయం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారడంతో చరణ్ నష్టనివారణ చర్యలు చాల స్పీడ్ గా చేపట్టాడు.ఈవ్యహారం పై అనేక గాసిప్పులు హడావిడి చేసినా ‘సైరా’ టీమ్ నుండి ఎటువంటి స్పందన రాకపోవడం వెనుక ఒక కారణం ఉంది అని అంటున్నారు. ఈసమస్య పై ఏమి మాట్లాడితే మరో సమస్య ఎలా వస్తుందో తెలియని పరిస్థుతులలో మౌనం వహించడమే మంచిది అన్న నిర్ణయానికి చరణ్ వచ్చి ఎవరూ ఊహించని మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.

తెలుస్తున్న సమాచారం మేరకు చరణ్ ఈవిషయమై అధికారుల నుండి నోటీసులు వచ్చిన వెంటనే వాటి గురించి రాయబారాలు చేయకుండా భాగ్యనగరంలోనే మరొకచోట ‘సైరా’ కు సంబంధించి మరొక సెట్ వేయించే నిర్ణయం తీసుకున్నాడట. ఈమూవీ షూటింగ్ ఆలస్యం అయ్యే కొద్ది అనేక సమస్యలు వస్తాయి అని భావనతో రామ్ చరణ్ ఈ షార్ప్ డెసిషన్ తీసుకున్నట్లు సమాచారం.

తెలుస్తున్న సమాచారం మేరకు నాలుగు రోజుల క్రితమే ఈసినిమా షూట్ పూర్తయినట్లు తెలుస్తోంది. నెలరోజులపాటు ఏకధాటిగా షూటింగ్ జరపడానికి వీలుగా ఈభారీ సెట్ వేసినట్లు సమాచారం. ఈ సెట్ లోనే బ్రిటీషర్లతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన భారీ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తోంది. ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పెట్టినరోజు పురస్కరించుకుని ఈసినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదలచేసే విషయంలో చాల జాగ్రత్తలు తీసుకుంటూ ఈ టీజర్ తో మరింత అంచనాలు ఈసినిమా పై పెరిగే విధంగా ఉండటానికి చరణ్ ఈవిషయానికి సంబంధించి ముంబాయిలోని ఒక ప్రముఖ గ్రాఫిక్ కంపెనీకి ఈబాధ్యతలు ఇప్పటికే అప్పచెప్పినట్లు సమాచారం..

Related Images: