సూపర్ స్టార్ మహేష్ బాబుపై ఇతర స్టార్స్ ఇలా..!

సూపర్ స్టార్ మహేష్ బాబుపై ఇతర స్టార్స్ ఇలా..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు నేడు పండగ రోజు. నేటితో ఆయన 43వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు… మెగాస్టార్ చిరంజీవి లాంటి పెద్ద స్టార్లు సైతంఆయనంటే అమితంగా ఇష్టపడతారు. ఒక మంచి వ్యక్తిత్వం, మంచి మనసున్న స్టార్‌గా ఆయన ఇండస్ట్రీలో పాజిటివ్ వైబ్స్ స్ప్రెడ్ చేశారు. గతంలో పలు సందర్భాల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు ఆయనంటే తమకు ఎంత ఇష్టమో చెప్పిన కొన్ని గ్రేట్ వర్డ్స్ గురించి ఓ సారి గుర్తు చేసుకుందాం.

చిరంజీవి

మా ఇంట్లో మహేష్ బాబును అంతా బాగా లైక్ చేస్తాం. మహేష్ సినిమాలు వరుసగా చూస్తుంటాం. ‘భరత్ అనే నేను’ సినిమాను రిలీజైన రోజే చూశాం. మహేష్ కు ఫోన్ చేసి సినిమా చాలా బావుందని చెప్పాను.

నాగార్జున

ఊరిపి సినిమా సమయంలో… మహేష్ బాబు నాకు ఫోన్ చేసి 20 నిమిషాలు మాట్లాడారు. వాట్ ఈజ్ దిస్ నాగ్.. ఫెంటాస్టిక్ అన్నాడు. ఇంకొన్ని మాటలు తెలుగులో ఓపెన్ గా చెప్పాడు. అవి మీ ముందు చెప్పలేను. మహేష్ ఏ విషయమైనా చాలా ఓపెన్‌గా మాట్లాడతారు. ‘ఇక మేమేం చూపించాలి అన్నాడు’… ఆయన ఏ మన్నాడో మీరే అర్థం చేసుకోండి అంటూ నాగ్ వ్యాఖ్యానించారు.

జూ ఎన్టీఆర్

భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఎన్టీఆర్ మాట్లాడుతూ… మీరందరూ ఆయన్ను ప్రిన్స్ అంటారు. సూపర్ స్టార్ అంటారు. నేను ఆయన్ను మహేష్ అన్న అంటాను. ఈ రోజు మహేష్ అన్న ఆడియో ఫంక్షన్‌కు నన్ను ముఖ్య అతిథి అంటున్నారు. నేనే ముఖ్య అతిథిగా రాలేదు. నేనొక కుటుంబ సభ్యుడిగా వచ్చాను.

రామ్ చరణ్

అందరూ మహేష్ బాబును అందగాడు అంటారు. ఆయనకున్న అందం కాస్త మాకు కూడా ఉంటే బావుంటుంది అనిపిస్తుంది.

సమంత

మహేష్ బాబు గురించి అందరికీ తెలియని విషయం… ఆయనకు సెన్సాఫ్ హ్యూమర్ 100 రెట్లు ఉంటుంది. అది ఎవరికీ కనిపించదు. ఆయనకు చాలా దగ్గరయితే ఆయన మన వద్ద ఆ సైడ్ ఓపెన్ చేస్తారు.

మహేష్‌ ఒక అడిక్షన్: పూరి జగన్నాథ్

మహేష్‌తో పని చేయడం మత్తు లాంటిది. మహేష్‌తో పని చేయడం ఎడిక్షన్. అనుక్షణం డైరెక్టర్‌కు కిక్ ఇచ్చే యాక్టర్ మహేష్. మనం ఒకటి అనుకుంటే దానికి పదింతలు చేస్తారు. ప్రతి రోజూ ఇంటికెళ్లి హ్యాపీగా నిద్రపోవచ్చు. అంతగా సంతృప్తినిస్తాడు.

త్రివిక్రమ్ శ్రీనివాస్

నేను, మహేష్ బాబు ఎక్కువగా మాట్లాడుకునేది ఏమిటంటే.. మీనింగ్‌ఫుల్‌గా ఉంటూ మనం కమర్షియల్‌ సక్సెస్ ఎందుకు సాధించలేం. ఇప్పుడున్న ట్రెండులో మీనింగ్ ఫుల్ సినిమాలు చేసే స్టార్లు అతి కొద్ది మంది ఉన్న టైమ్‌లో మీనింగ్ ఫుల్ సినిమా బాగా అర్థం చేసుకుని చేసే స్టార్ మహేష్ బాబు.

సుకుమార్

ఆకాశంలో చందమామ… మహేష్ బాబు ఒకటే. మనం మధ్యలో కేవలం అద్దం లాంటివాళ్లం. మనం ఎటు చూసినా ఒకటే.

ఎటకారం ఎక్కువ: సునీల్

మహేష్ బాబు గారు ఆయన ఫ్యామిలీ, టీమ్ విషయంలో వెరీ మచ్ లాయల్ గా ఉంటారు. చాలా క్లీన్ మనిషి. మీరందరూ ఊహించినదానికంటే మహేష్ బాబుగారికి ఎటకారం ఎక్కువ. ఆ విషయంలో నేను కూడా సరిపోను.

Related Images: