ఎన్టీఆర్‌, ప్రభాస్‌కు మంత్రి తలసాని సవాల్‌..!

ఎన్టీఆర్‌, ప్రభాస్‌కు మంత్రి తలసాని సవాల్‌..!

సినీ హీరోలు ఎన్టీఆర్‌, ప్రభాస్‌కు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హరిత సవాల్‌ విసిరారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ విసిరిన హరిత ఛాలెంజ్‌ను తలసాని స్వీకరించి పూర్తిచేశారు.

Minister Talasani Srinivas Yadav Haritha Challenge to NTR and Prabhas

శుక్రవారం ఇంటి ఆవరణలో మూడు మొక్కలు నాటిన ఆయన… ఎన్టీఆర్‌, ప్రభాస్‌, నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, తితిదే ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌కు హరిత సవాల్‌ చేశారు. తన సవాల్‌ను స్వీకరించాలని కోరారు. మానవాళి మనుగడ కోసం ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని మంత్రి పిలుపునిచ్చారు. హరితహారం పేరుతో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొన్ని కోట్ల మొక్కలను ఇప్పటికే నాటామని వెల్లడించారు. భవిష్యత్ తరాలకు ఆక్సిజన్ ఉండాలంటే అందరూ మొక్కలను నాటి వాటి సంరక్షణ భాద్యత కూడా తీసుకోవాలని కోరారు.

Related Images: