నాగార్జున కు షాక్ ఇస్తున్న విజయదేవరకొండ…!

నాగార్జున కు షాక్ ఇస్తున్న విజయదేవరకొండ…!

దేవదాస్ సినిమా నోటాతో పాటు రిలీజ్ అవుతుంది అయితే ఇంత వరకు ఈ సినిమా మీద బజ్ క్రీయేట్ అవ్వలేదు. ప్రేక్షకుల్లో ఈ సినిమా వస్తోందన్న ఆసక్తి అంతలా కనిపిస్తోందా? అన్నది అనుమానంగానే వుంది. ఇప్పటి వరకు సింగిల్స్ వదులుతున్నారు, స్టిల్స్ వదులుతున్నారు. అదంతా ట్విట్టర్ లో కనిపిస్తోంది, మీడియా గ్రూపుల్లో కనిపిస్తోంది. కానీ కింద లెవెల్ కు ఈ ఫబ్లిసిటీ వెళ్తున్నట్లు మాత్రం కనిపించడంలేదు.

devadas netivaartalu pic

నిజంగా అలా వెళ్లి వుంటే దేవదాస్ సినిమా హాట్ కేక్ లా అమ్ముడుపోయి వుండాలి. కానీ దాదాపు చాలా ఏరియాలు వైజయంతీ మూవీస్ ఓన్ గానే విడుదల చేసుకుంటున్నట్లు బోగట్టా. హీరో నాగ్ కు మరీ సూపర్ మార్కెట్ ఏమీలేదు. అందులోనూ ఆఫీసర్ సినిమా తరువాత అది ఢమాల్ మంది. ఇక నాని మీదనే భరోసా అంతా. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే, డైరక్టర్ కూడా బ్లాక్ బస్టర్ లు కాకపోయినా, సూపర్ హిట్ లు ఇవ్వలేదు. భలే మంచిరోజు, శమంతకమణి లాంటి యావరేజ్ సినిమాలే అందించారు.

devadas netivaartalu pic

ఇక మరో సమస్య బిగ్ బాస్. బిగ్ బాస్ పుణ్యమా అని నాని క్రేజ్ చాలావరకు డౌన్ అయిందని టాక్. వారానికి రెండురోజులు నానినే టీవీల్లో చూడడం, నాని వ్యవహారాలే డిస్కషన్లలో నానడం వంటి వాటి కారణంగా కూడా సినిమా వస్తోంది అంటే కొత్తగా అనిపించడం లేదు.పైగా ఈ సినిమా వస్తున్న వారానికే విజయ్ దేవరకొండ ‘నోటా’ వస్తోంది. ఆ సినిమా ఎలా వుంటుందన్నది పక్కనపెడితే ఓపెనింగ్స్ మాత్రం వుంటాయి. సినిమా బాగుంటే ఇక ఆగమన్నా ఆగవు. ఆపై వారానికే అరవింద సమేత సినిమా వస్తోంది. అంటే దేవదాస్ సినిమా వన్ వీక్ లోనే మాగ్జిమమ్ తెచ్చుకోవాలి.