కొనసాగుతున్న పెట్రోలు, డీజిల్‌ ధరల పెంపు

కొనసాగుతున్న పెట్రోలు, డీజిల్‌ ధరల పెంపు

విపరీతంగా పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై కేంద్ర ప్రభుత్వం లీటరుకు రూ.2.50 తగ్గిస్తూ కొంత సాంత్వన కలిగించినప్పటికీ.. ధరల పెంపు మాత్రం కొనసాగుతోంది. దేశరాజధానిలో దిల్లీలో శనివారం పెట్రోలు ధర లీటరుకు 18 పైసలు, డీజిల్‌ ధర లీటరుకు 29 పైసల చొప్పున పెరిగింది. దీంతో అక్కడ పెట్రోలు లీటరు రూ.81.68, డీజిల్‌ ధర రూ.73.24కు చేరింది. ముంబయిలో పెట్రోలు ధర రూ.87.15 ఉండగా.. డీజిల్ ధర 70 పైసలు తగ్గి రూ.76.75 గా ఉంది.

హైదరాబాద్‌లో ఈరోజు లీటర్‌ పెట్రోల్‌పై 19 పైసలు, డీజిల్‌పై 32 పైసలు పెరిగింది. దీంతో ఇక్కడ పెట్రోల్‌ ధర రూ.86.59, డీజిల్‌ ధర రూ.79.67కు చేరింది. మరోపక్క విచ్చల విడిగా పెరుగుతున్న ఇంధన ధరలపై కేంద్ర ప్రభుత్వం లీటరుకు రూ.2.50 మాత్రమే తగ్గించడంపై శివసేన పార్టీ మండిపడింది. ఐసీయూలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి బర్నాలు రాసిన చందంగా కేంద్రం ధరలు తగ్గించిందని విమర్శించింది.

Related Images: