30 ఏళ్ల తర్వాత అసలు సంగతి తెలుసుకుని షాక్ అయ్యాడు…

30 ఏళ్ల తర్వాత అసలు సంగతి తెలుసుకుని షాక్ అయ్యాడు…

మీరు అలా రోడ్డుపైన నడుస్తూ వెళుతుండగా ఏదో ఒక వింత వస్తువు దొరికిందనుకోండి.. అది కొత్తగా ఉంది కదా అని ఇంట్లో ఉంచుకుంటారు. అయితే అది ఏమిటో ఆ వస్తువు ఎంత విలువైందో మీకు ఆ సమయానికి తెలియదనుకుందాం. మీ కళ్ల ముందే అన్నేళ్లు ఉండిన ఆ వస్తువు విలువ తెలియక మీరు దాన్ని ఎలాపడితే అలా వాడేశారనుకుందాం… ఒక్క సారిగా ఎవరో వచ్చి అది కొన్ని కోట్లు విలువచేస్తుంది అని చెబితే మీరు షాక్‌కు గురవుతారా లేదా..? ఇలాంటిదే మిషిగాన్‌లో చోటుచేసుకుంది.

 
రాయిని డోర్ స్టాపర్‌గా పెట్టుకున్నాడు

1988లో మిషిగాన్‌కు చెందిన ఓ వ్యక్తి ఒక రాయిని మరో రైతు నుంచి కానుకగా పొందాడు. ఇది కేవలం రాయే కదా అని తేలిగ్గా తీసుకున్నాడు. రైతు ఆ రాయిని కానుకగా ఇచ్చాడు కాబట్టి దాన్ని పడేయలేక… అలా అని రాయిని ఇంట్లో ఉంచుకోలేక ఏమిచేయాలో తెలియక దాన్ని తన డోర్ స్టాపర్‌గా పెట్టుకున్నాడు. అంటే తలుపు గాలికి పడకుండా తలుపుకు అడ్డంగా రాయిని పెట్టాడు. ఇక రోజు ఉదయం నిద్రలేవగానే తలుపు తెరచి ఆ రాయిని దానికి అడ్డంగా పెడతాడు. అనంతరం రాత్రి నిద్రపోయే సమయంలో మళ్లీ ఆ రాయిని పక్కకు పెట్టి తలుపు మూసేస్తాడు. ఇలా ముప్పై ఏళ్లపాటు చేస్తూ వచ్చాడు. తలుపు తెరిస్తే రాయి కనబడుతుంది. తలుపు మూస్తే రాయి కనిపించదు.

 
ఈ అరుదైన రాయి విలువ కొన్ని లక్షల డాలర్లు

1930లో ఈ రాయి ఆకాశం నుంచి భూమిపైకి కిందపడటం చూశాడు రైతు. అయితే దీనిపై పెద్ద అవగాహన లేదు. రాయి భూమిలోకి చొచ్చుకొని పోయింది. కొన్నేళ్ల తర్వాత అదే రైతు భూమిని తవ్వి రాయిని బయటకు తీసి కానుకగా ఆ వ్యక్తికి ఇచ్చాడు. అయితే ఆ రాయి సంగతేంటో తెలుసుకుందామని భావించిన వ్యక్తి ఒక శాస్త్రవేత్త దగ్గరకు ఈ రాయిని తీసుకెళ్లాడు. బాగా పరీక్షించిన ఆయన ఇది ఒక ఉల్క అని తేల్చాడు. ఇందులో ఇమిడి ఉన్న ఖనిజాల విలువ సుమారు లక్ష డాలర్లు అని తేల్చాడు. దీంతో ఖంగుతిన్నాడు ఆ వ్యక్తి. ఇన్నేళ్లు కళ్లముందే ఇంతటి విలువైన వస్తువును పెట్టుకుని దీన్ని ఎలా పడితే అలా వాడానే అన్న బాధను వ్యక్తం చేశాడు.

 

 
ఉల్కలో 88శాతం ఐరన్..12 శాతం నికెల్ ఉన్నాయి

రాయి అనుకున్న ఈ ఉల్కలో 88శాతం ఐరన్, 12 శాతం నికెల్ ఉన్నాయి. ఇవి భూమిలో చాలా అరుదుగా దొరుకుతాయని పరిశోధకుడు తెలిపారు. ఇప్పటి వరకు అలాంటి రాయిని కానీ లేదా ఉల్క కానీ చూడలేదని చెప్పింది. ఇది అత్యంత విలువైన ఉల్క అని పేర్కొన్నారు. ఈ రాయికి ఎడ్మోర్ మీటియారైట్ అనే పేరు పెట్టారు. ఇంకా లోతైన పరిశోధనలు చేస్తే మరిన్ని ఖనిజాలు ఈ ఉల్కలో బయటపడే అవకాశముందని చెబుతున్నారు. దీంతో దాని విలువ మరింత పెరిగే అవకాశముందని శాస్త్రవేత్త మోనా సర్బెస్క్యూ చెబుతున్నారు.

Related Images: