సైరా ‘బిగ్ బి ‘ లుక్ వచ్చేసింది..

సైరా ‘బిగ్ బి ‘ లుక్ వచ్చేసింది..

బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్..ఇప్పటికే ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు మొదటిసారి తెలుగులో ఇప్పటివరకు చేయనటువంటి పాత్రలో కనిపించబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర పోషిస్తున్న సైరా నరసింహ రెడ్డి చిత్రం లో బిగ్ బి ఓ ప్రత్యేకమైన రోల్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈయనకు సంబందించిన కొన్ని సన్నివేశాలను షూట్ చేయడం జరిగింది.

ఇక ఈరోజు( అక్టోబర్ 11 న) ఈయన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భాంగా చిత్ర యూనిట్ సైరా లోని ఆయన పాత్ర తాలూకా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఇప్పటికే చిత్రంలో ప్రధాన పాత్రలకి సంబంధించిన ఫోటోలని వారి బర్త్‌డే సందర్బంగా విడుదల చేస్తున్న సైరా టీం. ఈరోజు అమితాబ్ బచ్చన్ బర్త్‌డే సందర్భంగా ఫస్ట్ లుక్‌తో పాటు మోషన్ పోస్టర్ ని విడుదల చేసారు.

ఈ మూవీ లో రాజగురువు గోసయి వెంకన్న పాత్రలో అమితాబ్ కనిపించనున్నట్టు తెలుస్తుంది. విజయ్ సేతుపతి, సుదీప్ , జగపతి బాబు, నయనతార తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బేనర్‌పై రామ్ చరణ్ సైరా చిత్రాన్ని భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.

Related Images: