రివ్యూ : అరవింద సమేత – ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునే చిత్రం..

రివ్యూ : అరవింద సమేత – ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునే చిత్రం..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన హైఓల్టేజ్ యాక్షన్ మూవీ అరవింద సమేత వీర రాఘవ. ఎన్నో ఏళ్ల నుండి నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్న త్రివిక్రమ్ కాంబోలో ఈ మూవీ వస్తుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్లే మూవీ టీజర్, ట్రైలర్, సాంగ్స్‌ ఉండడం తో సినిమా ఫై ఇంకాస్త అంచనాలు పెరిగాయి.

‘జై లవకుశ’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ చేస్తుండటం ఒక ఎత్తితే.. ‘అజ్ఞాతవాసి’ డిజాస్టర్ తరువాత త్రివిక్రమ్ ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితే ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టాడు. మరి త్రివిక్రమ్ కసి సినిమాలో కనిపించిందా..? ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడా..? అసలు వీర రాఘవుడి కథ ఏంటి అనేది పూర్తి రివ్యూ లో చూద్దాం.

కథ :

రెండు ఊర్ల మధ్య జరిగే పగే ఈ కథ. నల్లగుడి ఊరి పెద్ద బాసి రెడ్డి(జగపతి బాబు), కొమ్మద్ది ఊరి పెద్ద నారప రెడ్డి (నాగబాబు) ఇద్దరి మధ్య ఏర్పడిన ఓ చిన్న గొడవ రెండు ఊర్ల మధ్య పగ గా ఏర్పడుతుంది. ఈ సమయంలో విదేశాల నుండి నారపరెడ్డి కొడుకు వీర రాఘవ రెడ్డి(ఎన్టీఆర్‌) ఊరికి వస్తాడు. ఇంటికి వస్తున్న సమయంలో నారపరెడ్డి ఫై బాసి రెడ్డి వర్గీయులు దాడి చేసి చంపేస్తారు. ఆ తర్వాత వీర రాఘవ రెడ్డి హైదరాబాద్ కు వెళ్తాడు.

అక్కడ అరవింద(పూజా హెగ్డే) ను ఓ ప్రమాదం నుండి కాపాడతాడు..ఆ కాపాడడమే కథను పూర్తిగా మలుపు తిప్పుతుంది. ఇంతకీ అరవింద కు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకుంటుంది..అరవింద కు , కథ కు సంబంధం ఏంటి..? తండ్రిని చంపిన బాసి రెడ్డి ఫై వీర రాఘవ ఎలా పగ తీర్చుకుంటాడు అనేది అసలు కథ.

ప్లస్ :

* ఎన్టీఆర్ యాక్షన్ & ఎమోషన్

* జగపతి బాబు విలనిజం

* డైలాగ్స్

* తమన్ మ్యూజిక్

మైనస్ :

* త్రివిక్రమ్ మార్క్ కామెడీ తగ్గింది

* ప్రేమ సన్నివేశాలు సాగదీయడం

నటీనటుల పెర్పామెన్స్ :

* ముందుగా ఎన్టీఆర్ నటన గురించి చెప్పాలి.. వేట కొడవలి చేతపట్టి శత్రువుల్ని ఊచకోత కోస్తూ ‘కంటపడితే కనికరిస్తానేమో.. ఎంటపట్టానా నరికేస్తా’ అని ఎన్టీఆర్ గాండ్రిస్తుంటే థియేటర్స్ లలో ఆడియన్స్‌ కుర్చీల్లో కూర్చోవడం కష్టమే అయ్యింది. ‘జై లవకుశ’ చిత్రంలో తన నట విశ్వరూపాన్ని చూపించిన ఎన్టీఆర్ కాస్త గ్యాప్ తరువాత త్రివిక్రమ్ తో ఫ్యాక్షన్ నేపథ్యంలో రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో అరవింద సమేతగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘ఆది’ సినిమాలో ఆదికేశవరెడ్డిగా పవర్ ఫుల్ పాత్రలో కనిపించిన ఎన్టీఆర్ ఆ తరహా పాత్రలో చాలా ఏళ్ల తరువాత వీరరాఘవుడిగా అదరగొట్టాడు. సినిమా అంత తన భుజాల ఫై వేసుకొని నడిపించాడు. డైలాగ్స్ , ఎమోషన్ , డాన్స్ ఇలా ప్రతి దానిలో తన మార్క్ చూపించి ఆకట్టుకున్నాడు.

రాయలసీమ యాసలో ఎన్టీఆర్‌ డైలాగ్స్ అదుర్స్. ఆ డైలాగ్స్ కోసం ఎన్టీఆర్ చూపించిన డెడికేషన్‌ స్క్రీన్‌ మీద కనిపిస్తుంది. లుక్స్‌పరంగానూ ఎన్టీఆర్‌ ఎంతో కష్టపడ్డాడు. ఓవరాల్ గా ఎన్టీఆర్ టైటిల్ రోల్ పోషించి తన సత్తా చాటాడు.

* ‘మచ్చల పులి ముఖంపై గాండ్రిస్తే ఎట్టుంటుందో తెలుసా? మట్టి తుఫాన్ చెవిలో మోగితే ఎట్టుంటాదో తెలుసా? అంటూ టీజర్ లోనే తనదయిన డైలాగ్స్ తో ఆకట్టుకున్న జగపతి బాబు సినిమాలోనూ అంతే స్థాయి లో అదరగొట్టాడు. తన వేషధారణ మాత్రమే కాదు తన నటన కూడా చాల కొత్తగా ఉంది. ఎన్టీఆర్ – జగపతి బాబు ల మధ్య వచ్చే సన్నివేశాల అదిరిపోయాయి.

* ఇక టైటిల్ రోల్ పోషించిన పూజా హగ్దే గ్లామర్ గానే కాక నటన పరంగా కూడా ఫుల్ మార్కులు వేసుకుంది. సినిమా కథ మలుపు తిరగడం లో ఈమె పాత్ర కీలకమైంది.

* యంగ్ హీరో నవీన చంద్ర ఈ మూవీ లో సెకండ్ విలన్ గా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.

* కమెడియన్ నుండి హీరోగా షిఫ్ట్ అయిన సునీల్ ..మళ్లీ ఈ సినిమాతో కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రంలో నీలాంబరి పాత్రలో అదరగొట్టాడు.. సునీల్ – ఎన్టీఆర్ ల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి.

*నాగబాబుకు చాలా కాలం తరువాత మంచి పాత్ర దక్కింది. రావూ రమేష్‌, దేవయాని, సుప్రియా పాతక్‌, ఈషా రెబ్బా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతిక విభాగం :

* ముందుగా థమన్ గురించి మాట్లాడుకోవాలి..ముందుగా ఈ చిత్రానికి అనిరుద్ ను అనుకున్నారు. ఆ తర్వాత తమన్ పేరు ప్రకటించేసరికి ఈయన ఎలా చేస్తాడో అని అంత అనుమానాలు వ్యక్తం చేసారు. కానీ ఈ సినిమా కోసం థమన్ పడిన కష్టం ప్రతి ఫ్రేమ్ లోను తెలుస్తుంది. ఆడియో పరంగానే కాదు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలోనూ తమన్ పూర్తి న్యాయం చేసి , సినిమా సక్సెస్ కు కీలక పాత్ర పోషించాడు.

* పీఎస్‌ విందా సినిమాటోగ్రపి సైతం సినిమా సక్సెస్ లో భాగమైంది. ముఖ్యం గా రాయాలసీమ సెట్ లలో తన పనితనం కనిపించింది. నటి నటులందరిని తెర ఫై అందం గా చూపించడమే కాదు, సినిమా సెట్స్ ను సైతం అంతే అందంగా చూపించి ఆకట్టుకున్నారు.

* నవీన్ నూలి ఎడిటింగ్ సైతం ఎక్కడ బోర్ లేకుండా తన సహకారం అందించారు.

* ఇక త్రివిక్రమ్ గురించి చెప్పాలంటే..అజ్ఞాతవాసి’ డిజాస్టర్ తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న త్రివిక్రమ్.. నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలకు కథ, మాటలు అందించి దర్శకుడిగా.. అతడు, జులాయి, అత్తారింటికి దారేది, అ..ఆ, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలతో సత్తా చాటారు. ఇక స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేసిన ఈయన.. ఎన్టీఆర్‌తో సినిమా తీసేందుకు 12 ఏళ్లు సమయం పట్టింది.

సమయం తీసుకున్నప్పటికీ ఎన్టీఆర్ కు ఎలాంటి కథ అయితే సెట్ అవుతుందో అలాంటి కథ అందించాడు. ఫ్యాన్స్ తన నుంచి ఎక్స్‌పెక్ట్‌ చేసే డైలాగ్స్‌ ఎమోషన్స్‌తో పాటు, ఎన్టీఆర్‌ మార్క్‌ మాస్‌ ఎలిమెంట్స్‌ కూడా మిస్‌ అవ్వకుండా జాగ్రత్త పడ్డాడు. ఎన్టీఆర్‌ను అభిమానులు ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారో అంతకు మించి చూపించాడు. కామన్ గా త్రివిక్రమ్ మూవీ అంటే కామెడీ ఫై అంచనా వేస్తారు. కానీ ఈ సినిమా లో త్రివిక్రమ్ తన మార్క్ కామెడీ చూపించలేకపోయారు. కామెడీ డోస్ తగ్గించి యాక్షన్ డోస్ పెంచారు.

రెండు ఊర్ల మధ్య సాగే పగను మనం చాల సినిమాల్లో చూసాం..ఈ సినిమాలోనూ అలాంటి కథతోనే వచ్చాడు. కాకపోతే పూర్తిగా కాకుండా కాస్త కథలో ఎమోషన్ జోడించి ఆకట్టుకున్నాడు. మొదట చూపించిన వేగం అలాగే కొనసాగిస్తే బాగుండు..మధ్య లో కాస్త తగ్గించి మళ్లీ ప్రీ క్లైమాక్స్ కు వచ్చేసరికి స్పీడ్ చేసాడు. తాను ఏ విధంగా అనుకున్నాడో అలాగే తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు. నటి నటులను , సాంకేతిక వర్గాన్ని పూర్తి గా వాడుకున్నాడు.

చివరిగా :

ఎన్టీఆర్ నుండి అభిమానులు ఎలాంటి చిత్రాన్ని కోరుకుంటున్నారో అలాంటి చిత్రాన్ని అందించి ఆకట్టుకున్నాడు త్రివిక్రమ్. ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని చూపిస్తే, పూజా తన గ్లామర్ తో ఆకట్టుకుంది. తమన్ మ్యూజిక్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఇక గత దసరా బరిలో జై లవకుశ చిత్రం వచ్చి సూపర్ హిట్ గా నిలిస్తే, ఈ దసరా బరిలో అరవింద సమేత గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు ఎన్టీఆర్.

Related Images: