ఒక పార్టీ అధినేత అయిన జగన్ అలా మాట్లాడొచ్చా…

ఒక పార్టీ అధినేత అయిన జగన్ అలా మాట్లాడొచ్చా…

జగన్ వ్యాఖ్యల మీద చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. 30 ఏళ్ల వరకు నేనే ముఖ్యమంత్రినని చెప్పుకోవడం వినడానికి చాలా మందికి నచ్చడం లేదు. ప్రజాదరణ ఉంటే జగన్‌ కూడా సీఎంగా దశాబ్దాల తరబడి కొనసాగవచ్చు. అభ్యంతరం లేదు. కాని 30 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉంటానని తానే చెప్పుకోకూడదు. పార్టీలోని నాయకులు ఎవరైనా అంటే పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. కాని అధినేత చెప్పుకోకూడదు.

మొదట ఒకసారి ముఖ్యమంత్రి అయ్యేంతవరకు ఓపిక పట్టకపోతే ఎలా? వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయితే ఆ తరువాత టర్మ్‌కు కూడా తనను గెలిపించమని అడగొచ్చు. ‘వచ్చే ఎన్నికల తరువాత నేనే ముఖ్యమంత్రిని’ అని జగన్‌ బల్ల గుద్ది గతంలోనూ చెప్పారు. ‘ మన ప్రభుత్వం వస్తుంది’ అని భరోసా ఇచ్చారు. ‘రాజన్న రాజ్యం తెస్తా’ అన్నారు. టీడీపీ నేతలు ఎంతగా ఎద్దేవా చేసినా, విమర్శిస్తున్నా విడువకుండా పాదయాత్ర కొనసాగిస్తున్నాడు. ఎండా వానలను లెక్క చేయడంలేదు. ఇంత కష్టానికి ఫలితం దక్కితే మంచిదే.

 

‘కాబోయే ముఖ్యమంత్రిని నేనే’, ‘వచ్చేది వైసీపీ ప్రభుత్వమే’… అని చాలాసార్లు చెప్పిన జగన్‌ ఓసారి ‘2017లో ముఖ్యమంత్రినవుతా’ అని ప్రకటించి విస్మయపరిచారు. చంద్రబాబు ప్రభుత్వం ఏడాదిలో కూలిపోతుందని గతంలో అన్నారు. జగన్‌ ఇలా అతిశయోక్తిగా మాట్లాడితే అది ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశముండొచ్చు. కాస్త అలోచించుకుంటే మంచిది.

Related Images: