ఎన్టీర్ బయోపిక్ ను సెటైర్ గా మారుస్తున్న రకుల్ ప్రీత్ తమన్నాలు !

ఎన్టీర్ బయోపిక్ ను సెటైర్ గా మారుస్తున్న రకుల్ ప్రీత్ తమన్నాలు !

ఎన్టీఆర్ బయోపిక్ దర్శకుడుగా క్రిష్ ఎంటర్ అయిన దగ్గర నుండి ఈమూవీ పై అంచనాలు పెరిగాయి. దీనికితోడు ఈమూవీలోని బాలకృష్ణ ఎన్టీఆర్ లుక్ కు సంబంధించిన ఫోటోలు ఒకొక్కటి వరసగా విడుదల అవుతూ ఉంటే ఈమూవీకి మంచి బిజినెస్ ఆఫర్లు కూడ వచ్చాయి. దీనితో ఈమూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే ఆతరువాత ఈమూవీకి సంబంధించి చేసిన కొన్ని వ్యూహాత్మక తప్పులు వల్ల ఎన్టీఆర్ బయోపిక్ పై పెరిగిన క్రేజ్ నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతోంది. దీనికితోడు ఈమూవీని ఒకే సినిమాగా కాకుండా రెండు భాగాలుగా విభజించి కేవలం 15 రోజుల గ్యాప్ తో జనవరిలో విడుదల చేస్తూ ఉండటంతో వాస్తవాలను చెప్పకుండా కేవలం తూతూ మంత్రంగా అందరికీ తెలిసిన విషయాలను మళ్ళీ చెపుతూ ఏకంగా ఈసినిమాను రెండు భాగాలుగా తీస్తే ఎవరు చూస్తారు అంటూ అప్పుడే కామెంట్స్ మొదలై పోయాయి.

ఇది చాలదు అన్నట్లుగా అతిలోక సుందరి శ్రీదేవి పాత్రకోసం రకుల్ ప్రీత్ ను ఎంపిక చేసుకుని ఆమె శ్రీదేవి లుక్ ను విడుదల చేసిన తరువాత ఆలుక్ ను చూసిన చాలామంది ఆమె పై సెటైర్లు వేస్తూ ఎన్టీఆర్ బయోపిక్ కామెడీ షోగా మారిపోతుందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈమూవీలో శ్రీదేవిగా నటించినందుకు రకుల్ కు కోటి రూపాయలు పారితోషికం ఇచ్చినట్లు వచ్చిన వార్తలు కూడ కామెడీగా మారుతున్నాయి.

 

ఇది చాలదు అన్నట్లుగా జయప్రద పాత్ర కోసం తమన్నాను ఎంపిక చేయడంతో పాటు ఒకనాటి ‘అడవిరాముడు’ లోని ‘ఆరేసుకోపోయి పారేసుకున్నాను’ పాటను

యధాతధంగా బాలకృష్ణ తమన్నాల పై చిత్రీకరించబోతున్నారు అని వార్తలు రావడంతో ఎన్టీఆర్ బయోపిక్ రికార్డింగ్ డాన్స్ ల పర్వంగా మారుతుందా అంటూ సెటైర్లు వేస్తున్నారు. వాస్తవానికి ఎన్టీఆర్ జీవితంలో ఎదుర్కున్న ఆటుపోట్లు రాజకీయ వెన్నుపోట్లు కూడ చూపెట్టకుండా ఇలా గ్లామర్ డాల్స్ రకుల్ తమన్నాల పై బాలకృష్ణ చిందులు వేయడం ఎవరికీ అర్ధంకాని స్ట్రాటజీగా మారింది..

Related Images: