రాజమౌళికి చరణ్ తో ఊహించని సమస్యలు !

రాజమౌళికి చరణ్ తో ఊహించని సమస్యలు !

అత్యంత భారీ అంచనాలతో రాజమౌళి త్వరలో ప్రారంభించబోతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ప్రారంభానికి రామ్ చరణ్ వల్ల ఊహించని సమస్యలు ఏర్పడుతున్నాయి అన్న వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈసినిమాను నవంబర్ రెండవ వారంలో ప్రారంభించాలని రాజమౌళి భావించాడు.

అయితే తనకు మరో నెల గడువు కావాలని రామ్ చరణ్ రాజమౌళిని అడిగినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం చరణ్ బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ ఇంకా పూర్తి అవ్వకపోవడం అని తెలుస్తోంది. దీనితో రాజమౌళి చరణ్ అడిగినట్లుగా మరొకసారి ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ ను వాయిదా వేసే అవకాసం ఉంది అని తెలుస్తోంది.

ఇది ఇలా ఉండగా చరణ్ వ్యవహార శైలితో బోయపాటి చరణ్ ల మూవీ అనుకోని విధంగా ఆలస్యం అవుతోంది అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. చరణ్ రకరకాల కారణాలతో ఈమూవీ షూటింగ్ ను అనేక సార్లు క్యాన్సిల్ చేయించిన నేపధ్యంలో ఈమూవీకి ఇలాంటి సమస్యలు వచ్చాయి అని టాక్..

ఈపరిస్తుతులలో బోయపాటి ఒక దశలో రామ్ చరణ్ షూటింగ్ సెలవుల పై అసహనం ఉన్నా బయటకు వ్యక్త పరచాలేకపోయాడు అన్న వార్తలు కూడ హడావిడి చేస్తున్నాయి. ఇక లేటెస్ట్ గా ఈ మూవీ వైజాగ్ షెడ్యూలు ను మొదలు పెట్టారు. అయితే ఈ షెడ్యూల్ కాకుండా మరో చిన్న షెడ్యూల్ కూడ ఈమూవీకి మిగిలి ఉండటంతో ఈసమస్యలు అన్నీ తీరేదాకా తాను రాజమౌళి దగ్గరకు రాలేను అని చరణ్ చెపుతున్న నేపధ్యంలో ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రారంభం అయ్యే సరికి జనవరి వచ్చినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు..

Related Images: