బన్నీ త్రివిక్రమ్ చర్చలలో కుదరని సయోధ్య !

బన్నీ త్రివిక్రమ్ చర్చలలో కుదరని సయోధ్య !

త్రివిక్రమ్ ‘అరవింద సమేత’ సక్సస్ తో మంచి జోష్ లో ఉన్న నేపధ్యంలో అతడు తదుపరి సినిమా ఎవరితో ఉంటుంది అన్న విషయమై ఇప్పటికే అనేక వార్తలు వచ్చాయి. అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో మూవీ ఉండబోతోంది అన్న లీకులు కూడ వచ్చిన నేపధ్యంలో వీరిద్దరి సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన గురించి ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

ఇలాంటి పరిస్థుతులలో త్రివిక్రమ్ ఈమధ్య బన్నీకి వినిపించిన కథ అతడికి ఏమాత్రం నచ్చలేదు అన్న ప్రచారం జరుగుతోంది.దీనికి కారణం త్రివిక్రమ్ బన్నీ కోసం ఒక పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్ కథను తయారుచేసి వినిపించినట్లు టాక్. అయితే ఆకథ పూర్తిగా విన్న తరువాత అల్లు అర్జున్ కు రామ్ చరణ్ నటించిన ‘ధృవ’ మూవీ ఛాయలు కనిపించినట్లు సమాచారం.

దీనికితోడు బన్నీ ఈ ఏడాది సమ్మర్ రేస్ కు వచ్చిన ‘నాపేరు సూర్య’ లో మిలటరీ ఆఫీసర్ పాత్రను పోషించిన నేపధ్యంలో మళ్ళీ అదే ఉద్రేకంతో ఉండే పోలీసు పాత్ర ఏమిటి అంటూ అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచినట్లు టాక్. దీనికితోడు ఇప్పటికే టాప్ హీరోలు అంతా పోలీసు పాత్రలు చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన నేపధ్యంలో మళ్ళీ అలాంటి ప్రయోగం తనకు వద్దు అంటూ సూచన ప్రాయంగా అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో అన్నట్లు వార్తలు హడావిడి చేస్తున్నాయి.

దీనితో అల్లు అర్జున్ కోసం మరొక కథను వెతికే పనిలో త్రివిక్రమ్ టీమ్ బిజీగా ఉన్నట్లు సమాచారం. ఒకవేళ అనుకున్న విధంగా అల్లు అర్జున్ తో తన కాంబినేషన్ సెట్ కాకపోతే త్రివిక్రమ్ ఆలోచనలలో యంగ్ హీరో శర్వానంద్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే త్రివిక్రమ్ తీయబోయే తదుపరి సినిమాలో రష్మిక ఖాయం అంటూ వార్తలు వస్తున్న నేపధ్యంలో త్రివిక్రమ్ మ్యూజికల్ చైర్ లో అల్లు అర్జున్ సెట్ అవుతాడా లేదా శర్వానంద్ సెట్ అవుతాడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి..

Related Images: