దీపాల కాంతులతో దీపికా అత్తారిల్లు..!

దీపాల కాంతులతో దీపికా అత్తారిల్లు..!

రణ్ వీర్ సింగ్ , దీపిక పదుకునేల వివాహం జరిగిన సంగతి తెలిసిందే. నవంబర్ 14 – 15న ఇటలీలోని ఒక ఐలాండ్ లో వీరి వివాహం జరిగింది. రెండు సాంప్రదాయాల ప్రకారం వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పటికే వీరి పెళ్లి ఫొటోస్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

                   

ఇక దీపికా అత్తారిల్లును సైతం రంగు రంగు విద్యుత్ దీపాల కాంతులతో నింపేశారు. ఈనెల 18 న ఈ కొత్త జంట ముంబై రానున్నారు. నవంబర్ 21 వ తేదీన బెంగళూరులో రిసెప్షన్ ను ఏర్పాటు చేసి , నవంబర్ 28 వ తేదీన ముంబైలో మరో రిసెప్షన్ ను ఏర్పాటు చేస్తారట. ఈ రెండు వేడుకలకు పెద్ద ఎత్తున స్నేహితులను, సినీరంగ ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం రణవీర్ – దీపికా పెళ్లి సంబరాల్లో మునిగి తేలుతున్నారు.

Related Images: