కోహ్లీ వికెట్‌ తీశాడోచ్‌..!

కోహ్లీ వికెట్‌ తీశాడోచ్‌..!

టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ బ్యాటింగ్‌ రికార్డులే మనం ఇప్పటి వరకు చూశాం. ఈ రికార్డుల రారాజు బ్యాట్‌తో చేసేఅద్భుతాలను చూసి అబ్బురపడ్డాం. అయితే అప్పడప్పుడు బౌలింగ్‌ చేసే విరాట్‌ ఈసారి వికెట్‌ పడగొట్టడం విశేషం. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రాక్టీస్‌ టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ బౌలింగ్‌ చేసి తొలి వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం సంబరాలు కూడా చేసుకున్నాడు.

ఆసీస్‌తో ఎలెవన్‌తో జరుగుతున్న సన్నాహక మ్యాచ్‌ నాలుగో రోజు కోహ్లీ.. 170 బంతుల్లో 9 ఫోర్లతో శతకం నమోదు చేసి జోరుమీదున్న హరీ నీల్సన్‌ వికెట్‌ పడగొట్టాడు. వికెట్‌ తీసిన అనంతరం తన సహచర ఆటగాళ్లతో కలిసి సంబరాలు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను బీసీసీఐ ట్విటర్‌లో పంచుకుంది. ‘సారథి వికెట్‌ తీసిన వేళ..’ అంటూ కామెంట్‌ పెట్టింది.

మూడో రోజే కోహ్లీ కొన్ని ఓవర్లు వేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో మొత్తం 7 ఓవర్లు వేసిన విరాట్‌.. 27 పరుగులిచ్చి ఒక వికెట్‌ తీశాడు. అయితే కోహ్లీ బౌలింగ్‌ చేయడంపై స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ స్పందించాడు. రెండో కొత్త బంతి వచ్చే ముందు బౌలర్లు అలిసిపోయినందున కొన్ని ఓవర్లు వేయాలని కోహ్లీ అనుకున్నాడని పేర్కొన్నాడు. కోహ్లీ ఇప్పటికే వన్డే, టీ20, ఐపీఎల్‌ మ్యాచ్‌లతో నాలుగేసి చొప్పున వికెట్లు తీశాడు. డిసెంబర్‌ 6 నుంచి ఆసీస్‌తో తొలి టెస్టు జరగనుంది

Related Images: