ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ డిజప్పాయింట్..!

ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ డిజప్పాయింట్..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా టెంపర్. పూరికి చివరి హిట్ ఇచ్చిన సినిమా ఇదే.. ఇక కొన్నాళ్లుగా రొటీన్ సినిమాలు చేస్తూ వచ్చిన తారక్ కు టెంపర్ హిట్ ఉత్సాహాన్ని ఇచ్చింది. తెలుగులో హిట్టైన సినిమాల మీద బాలీవుడ్ కన్ను ఉంటుంది. అలానే టెంపర్ మీద బాలీవుడ్ మేకర్స్ కన్ను పడింది.

ధర్మ ప్రొడఖన్స్ లో కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రోహిత్ శెట్టి ఈ రీమేక్ ను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో రన్ వీర్ సింగ్, సారా ఆలీ ఖాన్ హీరోయిన్ గా నటించింది. సింబా టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ కొద్ది గంటల క్రితం రిలీజైంది. ఈ సినిమా ట్రైలర్ చూసిన నందమూరి ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారని చెప్పొచ్చు.

రీమేక్ దర్శకుడు రోహిత్ శెట్టి ఈ సినిమాను తను తీసిన సింగంకు లింక్ పెట్టి సినిమాలో ఉన్న ఫీల్ మిస్సయ్యేలా చేశాడు. సినిమాలో హీరో పాత్రని మాస్ గా చూపించాడు. ఇక చివర్లో సింగం హీరో అజయ్ దేవగన్ కూడా కనిపించి సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఈ ట్రైలర్ చూసిన వారు ఎవరైనా ఇది టెంపర్ రీమేక్ అంటే నమ్మశఖ్యంగా లేదని అంటున్నారు.

 

ఇక హిందితో పాటుగా టెంపర్ ను తమిళంలో విశాల్ కూడా రీమేక్ చేస్తున్నాడు. అక్కడ అయోగ్య పేరుతో ఈ సినిమా వస్తుంది. ఈమధ్యనే రిలీజైన అయోగ్య పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచింది. తమిళంలో విశాల్ ఇప్పుడు వరుస సక్సెస్ లతో ఫుల్ ఫాం లో ఉన్నాడు. మరి అటు సింబా, ఇటు అయోగ్య ఈ రెండు సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి. రన్ వీర్ సింబా మాత్రం డిసెంబర్ 28న రిలీజ్

Related Images: