జోమాటో నుంచి ఎంగిలి ఫుడ్ కావాలా నాయనా…చీ…చీ…viral video

జోమాటో నుంచి ఎంగిలి ఫుడ్ కావాలా నాయనా…చీ…చీ…viral video

ఎంతో నమ్మకంతో కస్టమర్లు ఆహారం కోసం ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలకు ఆర్డర్ చేస్తారు. ఓ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ మ్యాన్ నిర్వాకానికి పాల్పడ్డాడు.

కస్టమర్ల ఆహారాన్ని ఎంగిలి చేశాడు. ఈఘటన చెన్నైలో చోటుచేసుకుంది. కస్టమర్ల ఆహారం గుట్టు చప్పుడు కాకుండా ఎంగిలి చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జుమాటో ఉలిక్కిపడింది. సదరు డెలివరీ మ్యాన్‌ను వెంటనే తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఆదివారం సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. వీడియో జుమాటో దృష్టికి వెళ్లడంతో.. ఆగమేఘాల మీద అంతర్గత విచారణ జరిపించినట్టు తెలుస్తోంది. తమిళనాడులోని మధురైలో దీన్ని చిత్రీకరించినట్టు గుర్తించారు.


డెలివరీ మ్యాన్ పై వేటు 

విచారణ అనంతరం నిందితుడిని తమ సంస్థలో పనిచేస్తున్న డెలివరీ పార్ట్‌నర్‌గా గుర్తించామనీ.. అతడికి చీవాట్లు పెట్టి ఉద్యోగం నుంచి తొలగించామని జుమాటో ఓ ప్రకటనలో పేర్కొంది. తమ కంపెనీ చరిత్రలోనే ఇది చాలా అరుదైన, దురదృష్టకరమైన సంఘటన అని పేర్కొంది. నాణ్యమైన రీతిలో ఆహారం సరఫరా చేసేందుకు శక్తిమేర ప్రయత్నిస్తున్నామని తెలిపింది. వినియోగదారులు తమకు డెలివరీ అందగానే ఏమాత్రం తేడా అనిపించినా ఫిర్యాదు చేయాలని సూచించింది.

Related Images: