ఐపీఎల్ 2019 కోసం వేలం… క్రికెటర్స్, వారి ధరలు..

ఐపీఎల్ 2019 కోసం వేలం… క్రికెటర్స్, వారి ధరలు..

ఐపీఎల్ 2019 కోసం వేలం కొనసాగుతోంది… తొలిరౌండ్ ముగిసేసరికి ఈ సారి వేలంలో

– పేసర్‌ ఉనాద్కట్‌ను రూ. 8.4 కోట్లకు రాజస్థాన్ జట్టు కొనుగోలు చేసింది. 
– ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. 
– ఇక వెస్టిండీస్ ఆల్‌రౌండర్ బ్రాత్‌వైట్‌ను రూ.5కోట్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు సొంతం చేసుకుంది. 
– వెస్టిండీస్ జట్టుకు చెందిన మరో ఆటగాడు హెట్‌మైర్‌ను రూ.4.2 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కొనుగోలు చేసింది. 
– హనుమ విహారిని ఢిల్లీ జట్టు రూ.2కోట్లకు, అక్సర్ పటేల్‌ను రూ.5కోట్లకు సొంతం చేసుకుంది. 
– మలింగను ముంబై ఇండియన్స్ రూ. 2 కోట్లకు, ఇషాంత్ శర్మను రూ. 1.1 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకున్నాయి. 
– హెన్రిక్స్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు రూ.కోటికి కొనుగోలు చేసింది. – ఇంగ్లాండ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టోను హైదరాబాద్ జట్టు రూ.2.2కోట్లకు దక్కించుకుంది. 
– వికెట్ కీపర్ సాహాను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ.1.20 కోట్లకు కొనుగోలు చేసింది. 
– విండీస్ కీపర్ నికోలస్ పూరన్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ.4.20 కోట్లకు దక్కించుకుంది. 
– షమీని రూ. 4.8 కోట్లకు పంజాబ్ కొనుగోలు చేయగా… మోహిత్ శర్మను రూ. 5 కోట్లకు సొంతం చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్.

Related Images: