‘నందమూరి’ హీరోకి భారీ పోటీ..గెలుస్తాడా?

‘నందమూరి’ హీరోకి భారీ పోటీ..గెలుస్తాడా?

నందమూరి యువ హీరో కళ్యాణ్ రామ్..తాజాగా 118 అంటూ ఇంటరెస్టింగ్ థ్రిల్లర్ ఒకటి తీస్తున్నాడు. అయితే ట్రైలర్ లో కంటెంట్ కాస్త రొటీన్ గా ఉన్నా…ట్రైలర్ కాస్త థ్రిల్లింగ్ గానే అనిపించింది.

ఇక ఇప్పటికే వరుస ఫ్లాపులతో భారీ హిట్ కోసం వెయిట్ చేస్తున్న ఈ కుర్ర హీరో ఆయన ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టేసుకున్నాడు. కట్ చేస్తే 118 సినిమా రిలీజ్ చెయ్యాలి అని ప్లాన్ చేసే డేట్స్ లోనే తమిళ తలైవార్ రజనికాంత్ “పెట్ట”…మరో పక్క యువ హీరో అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ రెండు విడుదలకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది.

                     

ఒక పక్క రజనీకాంత్ రిపబ్లిక్ డే నాడు బరిలో దిగనుండగా..మరో పక్క అఖిల్ 25 న రానున్నాడు. మరి సంక్రాతికి ఖాళీ లేకనే రిపబ్లిక్ డేకి వాయిదా వేస్తే…ఆ డేట్స్ కూడా భారీ పోటీనే తలపిస్తున్నాయి.

మరి కళ్యాణ్ రామ్ బరిలో నిలుస్తాడా? గెలుస్తాడా? లేక వాయిదా వేసుకుని మెల్లగా వస్తాడా?

Related Images: