‘పేట’ తెలుగు ట్రైలర్ విడుదల..!

‘పేట’ తెలుగు ట్రైలర్ విడుదల..!

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన ‘పేట’ తెలుగు ట్రైలర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఇటీవల విడుదలైన తమిళ ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. ‘ఇరవై మందిని పంపించాను. అందర్నీ చితక్కొట్టి తరిమేశాడు’ అని ఓ వ్యక్తి చెబుతున్నప్పుడు రజనీని వెనక నుంచి చూపించిన సన్నివేశంతో ట్రైలర్‌ మొదలైంది. ‘చూస్తావ్‌గా.. ఈ కాళీ ఆడించే ఆట’ అని రజనీ డైలాగ్‌ చెప్పే విధానం ఆకట్టుకుంటోంది. ‘చూడ్డానికి చిల్లపిల్లాడిలా చాలా స్టైల్‌గా ఉన్నారు’ అని మేఘా ఆకాశ్‌..రజనీని చూసి చెబుతున్న డైలాగ్‌ బాగుంది. కొందరు రౌడీలు తలైవాను కొట్టడానికి వచ్చినప్పుడు ఆయన బల్లపై ఎక్కి స్టైల్‌గా కూర్చుని నవ్వుతూ..’నిజం చెబుతున్నాను.. కొట్టి అండర్‌వేర్‌తో పరిగెత్తిస్తాను..పరువు పోతే మళ్లీ తిరిగి రాదు చూస్కో..’ అని చెబుతున్న డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది.

                   

ఇందులో సిమ్రన్‌, త్రిష కథానాయికలుగా నటించారు. విజయ్‌ సేతుపతి ప్రతినాయకుడి పాత్ర పోషించారు. నవాజుద్దిన్‌ సిద్ధిఖి, బాబీ సింహా, శశికుమార్‌ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించారు. జనవరి 10న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Related Images: