చరణ్ అన్నకి దెబ్బేసిన వరుణ్ తేజ్..!

చరణ్ అన్నకి దెబ్బేసిన వరుణ్ తేజ్..!

సంక్రాంతి బరిలో మెగా బ్రదర్స్ ఇద్దరి ఫైట్ హాట్ న్యూస్ గా మారింది. నిన్న శుక్రవారం రాం చరణ్, బోయపాటి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వచ్చిన వినయ విధేయ రామ దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇచ్చింది. బోయపాటి విధ్వంసానికి బాక్సాఫీస్ షేక్ అవుతుందని భావిస్తే ఆడియెన్స్ తలలు బద్ధలవుతున్నాయని చెబుతున్నారు.

భారీ అంచనాలతో వచ్చిన వివిఆర్ సినిమా ఆ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. సినిమా ఫస్ట్ హాఫ్ కాస్త బెటర్ అనిపించుకున్నా సెకండ్ హాఫ్ దారుణమంటే దారుణంగా ఉంది. ఇక ఈ సినిమాకు పోటీగా ఈరోజు ఎఫ్-2 అంటూ మరో సినిమా వస్తుంది. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి చేసిన మల్టీస్టారర్ మూవీ ఎఫ్-2.

అనీల్ రావిపుడి డైరక్షన్ లో దిల్ రాజు నిర్మాతగా వచ్చిన ఎఫ్2 ఈరోజు రిలీజ్ అవుతుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో షో పడకపోయినా యూఎస్ ప్రీమియర్స్ తో ఎఫ్-2 హిట్ టాక్ సొంతం చేసుకుంది. వివి ఆర్ మీద ఎఫ్-2 విజయం సాధించిందని అంటున్నారు. ఓ పక్క ఎన్.టి.ఆర్ కథానాయకుడు పర్వాలేదు అనిపించగా.. చరణ్ వివి ఆర్ చేతులెత్తేసినట్టే కాబట్టి ఈ సంక్రాంతి సూపర్ హిట్ అంటే అది ఎఫ్-2 అనే అంటున్నారు.

 

దిల్ రాజు బ్యానర్ లో అనీల్ రావిపుడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వెంకటేష్ కామెడీ హైలెట్ గా నిలిచిందట. సినిమా మొదటి భాగం అంతా సూపర్ ఎంటర్టైనింగ్ గా ఉందని తెలుస్తుంది. ఈ సంక్రాంతికి ఫ్యామిలీ మొత్తం చూసే సినిమాగా ఎఫ్-2 సెన్సేషనల్ విజయం సాధిస్తుందని తెలుస్తుంది. సో అన్న చరణ్ పై వరుణ్ తేజ్ విజయం సాధించినట్టే.

Related Images: