‘భారతీయుడు 2’లోను విలన్ గా అక్షయ్ కుమార్

‘భారతీయుడు 2’లోను విలన్ గా అక్షయ్ కుమార్

శంకర్ దర్శకత్వంలో గతంలో వచ్చిన ‘భారతీయుడు’ సంచలన విజయాన్ని నమోదు చేసింది. దాంతో ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి శంకర్ రంగంలోకి దిగాడు. సీక్వెల్ కి సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. కమల్ కథానాయకుడిగా కనిపించనున్న ఈ సినిమాలో ఆయన సరసన కాజల్ అలరించనుంది. ఈ సినిమాలో సేనాపతి మనవడి పాత్రలో శింబు కనిపించనున్నాడు.

ఇక విలాన్ గా అక్షయ్ కుమార్ కనిపించే అవకాశాలు పుష్కలంగా వున్నాయనే టాక్ వినిపిస్తోంది. ‘2.ఓ’లో విలన్ గా చేసిన అక్షయ్ కుమార్ .. నూటికి నూరు మార్కులు కొట్టేశాడు. మరోసారి శంకర్ కాంబినేషన్లో చేయాలని ఉందనే ఉత్సాహాన్ని ఆయన అప్పుడే వ్యక్తం చేశాడు. అందువలన శంకర్ ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నాడట. విలన్ గా అక్షయ్ కుమార్ ఎంపిక దాదాపు ఖరారైపోతుందని చెప్పుకుంటున్నారు. ఇక కాజల్ ఈ సినిమా తన కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందని మురిసిపోతోందట.

Related Images: