సైరా జాతర కోసం భారీ ఖర్చు..

సైరా జాతర కోసం భారీ ఖర్చు..

మెగా స్టార్ చిరంజీవి – సురేందర్ రెడ్ట్ కలయికలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా – నరసింహ రెడ్డి’. ఉయ్యాలా వాడ నరసింహ రెడ్డి జీవిత కథ ఆధారంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే దాదాపు 70 % షూటింగ్ పూర్తి చేసుకుందట. ఇక ఇప్పటి వరకు భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించిన చిత్ర యూనిట్..తాజాగా ఓ జాతర సాంగ్ ను చిత్రీకరించేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ సినిమాలో ఓ జాతర పాట వుందట. ఈ సాంగ్ ను సినిమాకే హైలైట్ గా చిత్రీకరించడానికి డైరెక్టర్ & ప్రొడ్యూసర్ ఏర్పాట్లు చేస్తున్నారట. దాదాపు సినిమాలోని స్టార్ కాస్ట్ అంతా పాల్గొనే ఈ పాట కోసం రామోజీ ఫిలిం సిటీ లో భారీ జాతర సెట్ ను తయారు చేస్తున్నారు. ఈ సాంగ్ కోసం చరణ్ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారట. జనవరి 20 న లేదా 21 న ఈ సాంగ్ షూట్ ను మొదలు పెడతారట.

మొన్నటి వరకు వినయ విధేయ రామ తో బిజీ గా ఉన్న చరణ్..ఇప్పుడు సైరా పనుల్లో బిజీ అయ్యాడట. అలాగే ఈ నెల చివర్లో ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొదలు కాబోతుండడం తో ఆ లోపు సైరా పనులన్నీ పూర్తి చేయాలనీ చూస్తున్నాడట.

Related Images: