ఉరి సినిమాను అక్రమంగా డౌన్‌లోడ్ చేస్తే ఏమవుతుందో తెలుసా?

ఉరి సినిమాను అక్రమంగా డౌన్‌లోడ్ చేస్తే ఏమవుతుందో తెలుసా?

ఇండియన్ ఆర్మీ ఉరి దాడి తర్వాత పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపుదాడి చేసి వాటిని ధ్వంసం చేసిన సంగతి తెలుసు కదా. ఇదే స్టోరీతో బాలీవుడ్‌లో ఉరి అనే సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర కూడా ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నది. అయితే అన్ని సినిమాల్లాగే ఈ సినిమాకు కూడా పైరసీ బెడద పట్టుకుంది. ఈ విషయం ముందే తెలుసుకున్న మూవీ మేకర్స్.. పైరసీదారులకు దిమ్మదిరిగే షాకిచ్చింది. ఇలాగే ఉరి సినిమాకు చెందిన 3.2 జీబీ ఫైల్‌ను ఓ వ్యక్తి డౌన్‌లోడ్ చేసి షాక్ తిన్నాడు. తన అనుభవాన్ని అతడు ఫేస్‌బుక్‌లో షేర్ చేసుకున్నాడు. ఈ ఫైల్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేసి చూడగా.. మూవీ మధ్యలో లీడ్ రోల్స్‌లో కనిపించే విక్కీ కౌశల్, యామీ గౌతమ్.. పాకిస్థాన్‌లో చేయబోయే సర్జికల్ ైస్ట్రెక్స్ గురించి సీరియస్‌గా చర్చిస్తుంటారు. వెంటనే వాళ్లు మనవైపు చూసి.. మేం పాకిస్థాన్‌లోకి వాళ్లకు తెలియకుండా ఎలా వెళ్తామో.. మీ మొబైల్‌లోకి కూడా మీకు తెలియకుండానే వచ్చాం..

https://www.facebook.com/Arin.mandal40/videos/2279802002309399/

ఇలా దొంగచాటుగా మూవీని డౌన్‌లోడ్ చేసి చూడకుండా.. థియేటర్‌కు వెళ్లి చూడండి అంటూ వాళ్లు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 

Related Images: