తాత కాబోతోన్న నాగార్జున

తాత కాబోతోన్న నాగార్జున

ఆరుపదుల వయసులోనూ కుర్రహీరోలకు ఏమాత్రం తీసిపోని లుక్స్ కింగ్ నాగార్జున సొంతం. ఈ వయసులోనూ అమ్మాయిల మనసులు దోచే ఈ మన్మధుడు ఇప్పుడు తాతకాబోతున్నారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కబోతోన్న ‘బంగార్రాజు’ సినిమాలో నాగ్.. చైతు తాతగా కనిపిస్తారని తెలుస్తోంది. నిన్ననే ఈ ప్రాజక్ట్ కు నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అన్నపూర్ణ బ్యానర్లో సినిమా తెరకెక్కబోతోందని సమాచారం. కాగా, ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో నాగ్ పోషించిన ‘బంగార్రాజు’ పాత్ర బాగా పాపులర్. దాంతో అదే టైటిల్ గా పెట్టుకుని ఒక సినిమా చేయాలని చెప్పిన దర్శకుడు కల్యాణ్ కృష్ణకి మూడు నాలుగు సిట్టింగుల తర్వాత నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతోంది.

Related Images: