నేను టిఆర్‌ఎస్‌లో చేరుతున్నా : వంటేరు ప్రతాప్‌రెడ్డి

నేను టిఆర్‌ఎస్‌లో చేరుతున్నా : వంటేరు ప్రతాప్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆహ్వానం మేరకు తాను కారెక్కుతున్నట్లు కాంగ్రెస్‌ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఉదయం వంటేరు ప్రతాపరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ రోజు మధ్యాహ్నం టిఆర్‌ఎస్‌ అధ్యక్షులు కెటిఆర్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే అధికార పార్టీలో చేరుతున్నట్లు వివరించారు. గత రోజు రాత్రి (గురువారం) తన తండ్రి పార్టీ మారుతున్నట్లు వంటేరు ప్రతాప్‌రెడ్డి కుమారుడు ప్రకటించాడు. ఇదంతా అసత్యమని టిఆర్‌ఎస్‌ ఎంపి కొత్త ప్రభాకర్‌ ఖండించారు. వంటేరును తమ పార్టీలో చేర్చుకోలేమని చెప్పారు. ఈ రోజు వంటేరు ప్రతాప్‌రెడ్డి తానే స్వయంగా పార్టీ మారుతున్నట్లు వెల్లడించడంతో టిఆర్‌ఎస్‌ లో చేరికపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.