వరుణ్ కు బాక్సర్ ఎవరో తెలుసా..?

వరుణ్ కు బాక్సర్ ఎవరో తెలుసా..?

ఎఫ్ 2 తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్..తన తదుపరి చిత్రం ఫై ఫోకస్ చేసాడు. ఎఫ్ 2 తో వచ్చిన హిట్ ను నిలబెట్టుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం లో వరుణ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు.

ఇక వరుణ్ కు బాక్సింగ్ కోచ్ పాత్రలో సీనియర్ నటుడు యాక్షన్ హీరో అర్జున్ కనిపించబోతున్నట్లు సమాచారం. ఇటీవలే విడుదలైన ‘నా పేరు సూర్య’లో అల్లు అర్జున్ తండ్రి పాత్రలో కనిపించి అలరించిన సంగతి తెలిసిందే. మరోసారి మెగా హీరోతో నటించబోతున్నాడు. ఇక ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ పెద్ద కుమారుడు బాబీ ప్రొడక్షన్స్ హౌస్ తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related Images: