సందు దొరికితే బాలయ్య-జూ ఎన్టీఆర్‌పై రచ్చ!

సందు దొరికితే బాలయ్య-జూ ఎన్టీఆర్‌పై రచ్చ!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆధిపత్యం కొనసాగిస్తున్న మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ గురించిన ఏదో ఒక వివాదం తరచూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటుంది. గతంలో మెగాస్టార్ చిరంజీవికి, పవన్ కళ్యాణ్‌కు పండటం లేదనే పుకార్లు… బాలయ్య, జూ ఎన్టీఆర్‌కు మధ్య విబేధాలు ఏర్పడ్డాయనే రూమర్స్ హల్ చల్ చేశాయి.

తమ మధ్య అలాంటివేమీ లేదని, తాము కలిసే ఉన్నామని ప్రకటనలు చేసినా… సినిమా ఫంక్షన్లలో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చినా.. మళ్లీ ఏదో ఒక కారణంతో ఇలాంటి వార్తలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి బాలయ్య-ఎన్టీఆర్ మధ్య విబేధాలు అంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ గుప్పుమన్నాయి.

ఈ వార్తలకు కారణం ఏమిటి?

తాజాగా బాలయ్య-ఎన్టీఆర్ మధ్య విబేధాలు ఉన్నాయంటూ రూమర్స్ తెరపైకి రావడానికి కారణం ఇటీవల విడుదలైన ‘ఎన్టీఆర్-కథానాయకుడు’ సినిమాపై తారక్ ఇప్పటి వరకు స్పందించక పోవడమే. నందమూరి కుటుంబ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమా చూసి అద్భుతం అంటూ పొగడ్తలు గుప్పించినా… ఎన్టీఆర్ కనీసం ఈ సినిమా చూడక పోవడం, స్పందించక పోవడం ఈ రూమర్లకు కారణమైంది.

దానికి సమయం ఉంది కానీ, దీనికి లేదా అంటూ..

అఖిల్ అక్కినేని నటిస్తున్న ‘మిస్టర్ మజ్ను’ ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం సాయంత్రం జరుగబోతోంది. దీనికి ఎన్టీఆర్ చీఫ్ గెస్టుగా హాజరవుతున్నారు. దీన్ని సాకుగా చూపుతూ… జూనియర్‌కు ‘ఎన్టీఆర్-కథానాయకుడు’ సినిమా చూసే సమయం లేదు కానీ, అఖిల్ సినిమా ఫంక్షన్‌కు వచ్చేందుకు తీరిక ఉందా? అంటూ కొందరు ఈ రచ్చకు తెరలేపినట్లు తెలుస్తోంది.

ఇది యాంటీ ఫ్యాన్స్ పనేనా?

ఈ అర్థం పర్దంలేని వార్తల వెనక ఉన్నది బాలయ్య లేదా జూ ఎన్టీఆర్‌ను వ్యతిరేకించే యాంటీ ఫ్యాన్స్ పనే అనే వాదన వినిపిస్తోంది. ఇటీవల బాలయ్య, జూ ఎన్టీఆర్ ‘ఎన్టీఆర్-కథానాయకుడు’ ప్రీ రిలీజ్ ఈవెంటులో ఒకే వేదికపై కనిపించారు. తాతగారి సినిమా బాబాయ్ తప్ప ఎవరూ తీయలేరంటూ ఎన్టీఆర్ ప్రశంసలు సైతం గుప్పించారు. వీరి మధ్య రిలేషన్ బాగానే ఉందనడానికి ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి అని వాదించేవారూ లేక పోలేదు.

సినిమాకు పాజిటివ్ టాక్

‘ఎన్టీఆర్-కథానాయకుడు’ చిత్రం కలెక్షన్ల పరంగా కాస్త వెనకపడి ఉన్నప్పటికీ సినిమాకు క్రిటిక్స్, ఆడియన్స్ నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం ‘మహానాయకుడు’ ఫిబ్రవరిలో విడుదలకాబోతోంది.

Related Images: