’96’ రీమేక్ ఫై దిల్ రాజు క్లారిటీ..

’96’ రీమేక్ ఫై దిల్ రాజు క్లారిటీ..

విజయ్ సేతుపతి , త్రిష జంటగా తమిళం లో తెరకెక్కిన చిత్రం ’96’. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ తమిళ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని వసూళ్ల వర్షం కురిపించింది. ఈ చిత్రాన్ని తెలుగు లో దిల్ రాజు నిర్మించబోతున్నట్లు చాల రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.

ఈ రీమేక్ లో హీరోహీరోయిన్లుగా ఎవరు నటిస్తున్నారనే విషయం ఫై ఇటీవల కొందరి పేర్లు తెరమీదకు వచ్చాయి. అయితే ఆ వార్తలపై చిత్ర యూనిట్ స్పదించకపోవడంతో వాటిని పుకార్ల గానే అంత తేల్చారు. దీంతో తాజాగా దిల్ రాజు ఈ వార్తల ఫై క్లారిటీ ఇచ్చారు. శర్వానంద్ , సమంత జంటగా నటించనున్న ఈ చిత్రాన్ని ఒరిజినల్ వెర్షన్ కు దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమారే తెరకెక్కిస్తున్నాడని , అతి త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి రాబోతుందని రాజు చెప్పుకొచ్చారు.

తాజాగా దిల్ రాజు నిర్మించిన ఎఫ్ 2 బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయం సాధించడం తో చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటున్నారు.

Related Images: