కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ… సిగ్గు, భయానికి గురైన వరుణ్ తేజ్!

కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ… సిగ్గు, భయానికి గురైన వరుణ్ తేజ్!

వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌, తమన్నా, మెహ్రీన్‌ హీరో హీరోయిన్స్‌గా దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో శిరీష్‌, లక్ష్మణ్‌ నిర్మించిన చిత్రం ‘ఎఫ్‌ 2- ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌’. ఈ చిత్రం సంక్రాంతి విన్నర్‌గా నిలిచిన నేపథ్యంలో హైదరాబాద్‌లో గ్రాండ్‌గా సక్సెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్బంగా వెంకటేష్, వరుణ్ తేజ్ స్పీచ్ ఆకట్టుకుంది. ఇలాంటి విజయం అందించిన అభిమానులకు మనస్పూర్తిగా థాంక్స్ చెబుతున్నట్లు వ్యాఖ్యానించారు వెంకటేష్.

అందరూ నవ్వుతుంటే నాకు మాత్రం కన్నీళ్లు వచ్చాయి: వెంకటేష్

పదేళ్ల తర్వాత థియేటర్‌కు వెళ్లి అక్కడ రియాక్షన్ చూసినపుడు అందరూ నవ్వుతున్నారు. నాకు మాత్రం కళ్లలో కన్నీళ్లు వచ్చాయి. చాలా రోజుల తర్వాత అలాంటి రియాక్షన్ చూసినపుడు, మేమంతా కష్టపడి పని చేసి ఆ సినిమా మీకు చూపెట్టినపుడు, మీరంతా ఆదరించి అంత ప్రేమ చూపినపుడు అదొక వండర్ ఫుల్ ఫీలింగ్.

 

చాలా రోజుల తర్వాత ఇలాంటి హిట్

సంక్రాంతికి గతంలో నేను చేసిన గణేష్, ప్రేమించుకుందాం రా, బిగినింగ్ సినిమాలు బొబ్బిలి రాజా, చంటి, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు… ఎన్నో చిత్రాలను సూపర్ హిట్ చేశారు. చాలా రోజుల తర్వాత మళ్లీ ఇలాంటి ఎంటర్టెన్మెంట్ కథ చేశాను. అనిల్ ఇలాంటి కథ చెప్పినపుడే ఆనందం వేసిందని వెంకటేష్ తెలిపారు.

కామెడీ అంటే ఆ ఇద్దరి సినిమాలే: వరున్ తేజ్

ఒక సినిమా వెనక వంద రెండొందల మంది ఎఫర్ట్ ఉంటుంది. ఈ సినిమాకు పని చేసిన అందరూ ఒక పాజిటివ్ యాటిట్యూడ్‌తో చేస్తూ వచ్చారు. చాలా పెద్ద టీమ్ పని చేసింది. అందరికీ పేరు పేరున థాంక్స్. నేను చిన్నపుడు కామెడీ అంటే ఇద్దరి సినిమాలే చూసేవాడిని… చిరంజీవి గారిది, వెంకటేష్ గారిది. వారిని తెరపై చూసి మనం ఇలా చేయగలుగుతామా? అనుకునే వాడిని…. అని వరుణ్ తేజ్ గుర్తు చేసుకున్నారు.

వెంకీగారు అనగానే సిగ్గు, భయం ఉండేది: వరుణ్ తేజ్

వెంకటేష్ గారి సినిమాలు చూసి ఆయనతో కలిసి చేయడం ఒక మంచి అనుభూతి. అనిల్ సీన్ చెప్పి ఇలా రెచ్చిపోండి అనేవారు. కానీ ఎక్కడో సిగ్గు, భయం ఉండేది. వెంకటేష్ గారు మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్, ఇలా ప్రతీ సినిమాలో కుమ్మేశారు. ఆయనతో కలిసి చేయడం ఎలా అనుకునేవాడిని. కానీ ఆయన చాలా సపోర్ట్ చేశారు. నన్ను ఒక బ్రదర్‌లా చూశారు. నాకు చిరంజీవిగారు పెదనాన్న అయినా… వెంకటేష్ గారు మాత్రం కోబ్రో, మంచి ఫ్రెండ్. ఆయనతో పని చేయడం హ్యాపీగా ఉంది.. అన్నారు.

ఎఫ్ 3 వస్తోంది

ఎఫ్ 2 అంటే ఫన్ అండ్ ఫ్రస్టేషన్.. ఒక ఫన్‌కే మీరు ఇంత అభిమానం చూపించారు. త్వరలో ఎఫ్ 3 అని మరో మూవీ చేయబోతున్నాం. ఎఫ్ 2నే ఇలా ఉంటే ఎఫ్ 3 ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. అంతా సిద్ధంగా ఉండండి… త్వరలోనే వస్తున్నామని వరుణ్ తేజ్ ప్రకటించారు.

Related Images: