ఉచిత కంప్యూటర్ శిక్షణకు దరఖాస్తులు

ఉచిత కంప్యూటర్ శిక్షణకు దరఖాస్తులు

నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన నియోకర్సర్‌లో కంప్యూటర్ బేసిక్ కోర్సులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నామని అడ్మిన్ మేనేజర్ రాణా ప్రతాప్ తెలిపారు. ఫిబ్రవరి 5 నుంచి ఈ శిక్షణ తరగతులు ప్రారంభమవుతున్నాయని ఆయన వివరించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కోర్సుల్లో చేరే వారికి ఎలాంటి విద్యార్హత, వయోపరిమితి లేదన్నారు. ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి ఉన్న వారు 94948 64040 కి సంప్రదించాలన్నారు.

Related Images: