టి20 టాప్‌ స్కోరర్‌గా రోహిత్‌

టి20 టాప్‌ స్కోరర్‌గా రోహిత్‌

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ-20 మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ చేసిన రోహిత్‌..36 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మార్టిన్‌ గప్టిల్‌ను వెనక్కినెట్టి అత్యధిక పరుగులు చేసిన బ్యాట్‌సమెన్‌గా నిలిచాడు. అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన వారిలో తొలి స్థానంలో గప్టిల్‌( 2272), రెండో స్థానంలో షోయబ్‌ మాలిక్‌(2263)లు ఉన్నారు. ప్రస్తుతం రోహిత్‌ 92 టి20ల్లో మొత్తం 2288 పరుగులు చేసి మొదటి స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. రెండో టి20లో రోహిత్‌ కేవలం 29 బంతుల్లో 4 సిక్స్‌లు, 3 ఫోర్లతో 50 పరుగులు చేసి ఔటయ్యాడు.