సైరాలో జగపతి బాబు లుక్ ఇదే..!

సైరాలో జగపతి బాబు లుక్ ఇదే..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ చారిత్రాత్మక చిత్రం సైరా నరసింహరెడ్డి. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌, విజయ్ సేతుపతి, సుదీప్‌, జగపతి బాబు, నయనతార, తమన్నా వంటి విలక్షణ నటులు నటిస్తున్నారు. హీరో నుండి విలన్‌గా టర్న్ తీసుకొని వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తున్న జగపతి బాబు బర్త్ డే నేడు కావడంతో ఆయన పుట్టిన రోజు సందర్భంగా సైరాలో జగపతి బాబు లుక్ విడుదల చేశారు. వీరా రెడ్డి పాత్రలో జగపతిబాబు లుక్ ఆకట్టుకునేలా ఉంది. భుజాల వరకూ జుట్టూ, బాగా పెరిగిన గడ్డం, మీసాలతో సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నారు జగపతి బాబు. గత కొద్ది రోజులుగా సినిమాలో నటిస్తున్న స్టార్స్ పుట్టిన రోజుని పునస్కరించుకొని వారికి సంబంధించిన పాత్రలని చిత్ర యూనిట్ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. దసరా కానుకగా ఈ చిత్రం రిలీజ్ కానుంది. సైరా చిత్రాన్ని రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్‌పై నిర్మిస్తున్నారు.

Related Images: