మహేష్ సుకుమార్ ల మూవీకి చెక్ పెడుతున్న నిహారిక !

మహేష్ సుకుమార్ ల మూవీకి చెక్ పెడుతున్న నిహారిక !

మహేష్ బాబు 26వ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తాడని అధికారిక ప్రకటన వచ్చిన తరువాత కూడ ఆసినిమాకు సంబంధించిన కథ ఫైనల్ కాక పోవడంతో మహేష్ 26వ చిత్ర దర్శకుడుగా అనిల్ రావిపూడి రంగప్రవేశం చేస్తున్నాడని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తెలుస్తున్న సమాచారం మేరకు ఫారెస్ట్ బ్యాక్ గ్రౌండ్ లో సుకుమార్ చెప్పిన కధకు మొదట్లో ఓకె చెప్పిన మహేష్ ఆ తరువాత ఈసినిమాకు సంబంధిచిన ఫైనల్ స్క్రిప్ట్ పూర్తి అయిన తరువాత ఈ స్క్రిప్ట్ విషయమై వ్యక్త పరిచిన అనేక సందేహాలకు సుకుమార్ షాక్ అయి సుకుమార్ మహేష్ కోరుకున్న విధంగా స్క్రిప్ట్ మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.

 

దీనితో ఎందరో టాప్ హీరోలకు ఎన్నో వైవిధ్యమైన కధలను తయారుచేసిన సుకుమార్ పెన్ పవర్ కు ఏమైంది అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఈసమయంలో సుకుమార్ మరో సినిమాకు సంబంధించిన ప్రచారం ప్రస్తుతం జోరుగా సాగుతోంది. సుకుమార్ మహేష్ ల మూవీని పక్కకు పెట్టి నిహారికతో ఒక హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ తీయడానికి చర్చలు జరుపుతున్నాడు అన్నవార్తలు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి.

ప్రస్తుతం సుకుమార్ తన బ్యానర్ లో రెండు చిన్న సినిమాలను తీస్తున్న విషయం తెలిసిందే. దీనితో ఈ రెండు సినిమాలతో పాటు మరోక సినిమాగా నిహారిక మూవీని తీస్తాడా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే మహేష్ సినిమా కోసం దాదాపు సంవత్సర కాలం వృథా చేసుకున్న సుకుమార్ ఇలాంటి సాహసం చేయడనీ ఎవరో కావాలని మహేష్ సుకుమార్ ల మూవీ ప్రాజెక్ట్ ను బ్రేక్ చేయడానికి ఇలాంటి రూమర్స్ పుట్టిస్తున్నారు అంటూ సుకుమార్ సన్నిహితులు అంటున్నారు. అయితే టాప్ హీరోల సినిమాలకు సంబంధించి కూడ షూటింగ్ స్పాట్ లో స్క్రిప్ట్ మార్చే అలవాటు ఉన్న సుకుమార్ ప్రస్తుతం మహేష్ పెడుతున్న టార్చర్ తట్టుకోలేక ఎందుకైనా మంచిదని నిహారిక ప్రాజెక్ట్ ను కూడ లైన్ లో పెట్టి ఉంటాడు అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు..

Related Images: