సంచలనం.. త్వరలో లోకేశ్, నారాయణ రాజీనామాలు..?

సంచలనం.. త్వరలో లోకేశ్, నారాయణ రాజీనామాలు..?

ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం చోటు చేసుకోబోతోంది . ఏపీ మంత్రులు నారా లోకేశ్ , నారాయణ రాజీనామాలు చేయబోతున్నారు .. అదేంటి ఇలాంటి కీలకమైన సమయంలో వారు రాజీనామాలు చేయడమేంటనుకుంటున్నారా .. అక్కడే వుంది అసలు విషయం .

వారు రాజీనామాలు చేసేది మంత్రి పదవులకు కాదు .. ఎమ్మెల్సీ పదవులకు .. వారిద్దరూ ఎమ్మెల్సీలు అవ్వడం ద్వారానే మంత్రి పదవులు అలంకరించారు . ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి . వచ్చే ఎన్నికల్లో వీరిద్దరూ అసెంబ్లీకి పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు .

అందుకే ఇప్పుడు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు . దీని వల్ల ఆ స్థానాలు పార్టీలో టిక్కెట్లు రానివారికో .. అసంతృప్తులకో కట్టబెట్టొచ్చన్నమాట . తాము ఎలాగూ అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు కనుక .. ఈ మూడు నెలలూ ఎమ్మెల్సీలు లేకపోయినా ఇబ్బంది లేదు .

మరి ఏ సభలోనూ సభ్యుడు కాకుండా మంత్రి పదవి ఎలా అంటారా .. అలా ఆరు నెలలపాటు మంత్రిగా ఉండే అవకాశం ఎలాగూ రాజ్యాంగం కల్పించింది . మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి . అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారని ప్రముఖ మీడియా సంస్థలో కథనాలు వచ్చాయి .

Related Images: