లండన్ హోటల్ లో మోసపోయిన రకుల్ ప్రీత్ !

లండన్ హోటల్ లో మోసపోయిన రకుల్ ప్రీత్ !

రకుల్ ప్రీత్ ఎన్నో ఆశలు పెట్టుకుని నటించిన ‘దేవ్’ మూవీ కూడ ఘోరమైన ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకోవడంతో ఆమె పరిస్థితి ప్రస్తుతం మరింత అయోమయంలో పడిపోయింది. వాస్తవానికి ఆమెకు చేతిలో ఇంకా నాలుగు తమిళ సినిమాలు ఉన్నా ఆమె దృష్టి అంతా టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ పైనే ఉంది.

దీనితో రకుల్ తనకు పరిచయం అయిన హీరోల ద్వారా అవకాశాల కోసం రాయబారాలు చేస్తోంది అని వార్తలు వస్తున్నాయి.నాగచైతన్య రికమండేషన్ తో ‘వెంకీ మామ’ లో ఛాన్స్ తెచ్చుకున్న రకుల్ త్వరలో బోయపాటి కాంబినేషన్ లో బాలయ్యతో తీయబోతున్న మూవీలో హీరోయిన్ చాన్స్ కోసం అటు బాలయ్యను ఇటు బోయపాటిని లైన్ లో పెడుతూ పారితోషికం కూడ తగ్గిస్తాను అని సంకేతాలు ఇస్తున్నట్లు టాక్.

ఇది ఇలా ఉండగానే ఈమధ్య ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ తాను లండన్ లో మోసపోయిన విషయాలను సరదాగా వివరించింది. కొన్ని నెలల క్రితం రకుల్ తన చిన్ననాటి స్నేహితులతో కలిసి లండన్ కు వెళ్ళి అక్కడ ఒక ప్రముఖ హోటల్ లో డిన్నర్ చేసిందట. అయితే ఆ డిన్నర్ లో ఆమెకు ఊహించని షాక్ తగిలినట్లు ఆమె ఆ ఇంటర్వ్యూలో చెప్పింది.

ఆ డిన్నర్ పూర్తి అయిన తరువాత ఆమెకు లండన్ లోని ఆ స్టార్ హోటల్ వాళ్ళు ఇచ్చిన బిల్లు పది లక్షల రూపాయలు కావడంతో ఆమెకు తల తిరిగిన పరిస్థితి ఏర్పడిందట. దీనితో రకుల్ తన ట్విటర్ లో లండన్ లోని ఆ స్టార్ హోటల్ ప్రస్తావిస్తూ ఎవరైనా లండన్ వెళితే పొరపాటున కూడ ఆ హోటల్ వైపు వెళ్ళవద్దు అంటూ హెచ్చరికలు ఇస్తోంది. అయితే ఈ హెచ్చరికలను చూసిన కొందరు మాత్రం కోట్లల్లో పారితోషికం తీసుకుంటున్న రకుల్ స్నేహితులకు పది లక్షలు ఖర్చు పెట్టలేదా అంటూ సెటైర్లు వేస్తున్నారు..!

Related Images: